matrukruchha urinary infection home remedy

మూత్రకృచ్చ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద చిట్కాలు

మన శరీరంలో ముఖ్యమయిన వ్యస్థలలో మూత్ర వ్యవస్థ ఒకటి. నేడు మారిపోయిన అలవాట్లు, ఆహారపు విభిన్నత, జీవన శైలి మొదలైన వాటివల్ల విరుద్ధమైన ఆహారం మన రోజులో భాగమైపోతూ శరీరంలో అసమానమై ప్రకోపించే వాత, పిత్త, కఫ దోషాలు ఊత్రాశయంలోకి చేరి, మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ ఉండటం వల్ల, మూత్రాశయంలో పనితీరు మందగించి మూత్రం విసర్జించేటపుడు సాఫీగా జరగకుండా కొద్దికొద్దిగా పడుతూ ఇబ్బది పెట్టె సమస్యనే మూత్రకృచ్చ వ్యాధి అని అంటారు.

మూత్రకృచ్చ వ్యాధికి కారణాలు

◆ వాహనాల మీద ఎక్కువ దూరం, ఎక్కవ సమయం ప్రయాణించడం

◆ వ్యాయామాలు, శారీరక శ్రమ అతిగా చేయడం.

◆ వేడి చేసే పదార్థాలను ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం.

◆ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం

◆ అతిగా మద్యపానం చేయడం మరియు, అతిగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాకుండా ఉండటం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.

అద్భుతమైన చిట్కాలు

◆ అశ్వగంధ, తిప్పతీగ, శొంఠి, ఉసిరిక, పల్లేరు మొదలైన అయిది పదార్థాలతో కలిపి కషాయాన్ని తయారుచేసి రోజు రెండు పూటలా రెండు ఔన్స్ ల పరిమాణంలో సేవిస్తూ ఉంటే వాతదోషం వల్ల  కలిగే మూత్రకృచ్చ వ్యాధి తగ్గిపోతుంది.

◆ అతిమధురం, నక్కదోసకాయలలో గింజలు, మాను పసుపు ఈ మూడింటిని సమభాగలుగా కలిపి బియ్యం కడిగిన నీళ్లతో 10 గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే పిత్త దోషం వల్ల పుట్టి, పసుపు రంగుతో రక్తంతో కూడి భరించలేని మంటతో మూత్రం విడుదల అయ్యే సమస్యను నివారిస్తుంది.

◆ మాను పసుపు చూర్ణం, ఉసిరిక చూర్ణం సమంగా కలిపి నిల్వచేసుకుని పూటకు 5 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మంటతో కూడిన మూత్రకృచ్చ వ్యాధి  నయమవుతుంది.

◆ మనం తరచుగా స్వీట్లలో వాడే ఏలకులు కూడా ఈ సమస్యను తగ్గించడంలో పనిచేస్తాయి.  ఏలకులు చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా ఆవు మూత్రంతో కానీ,  అరటిదుంప రసంతో కానీ  కలిపి  రెండు పూటలా సేవిస్తూ ఉంటే కఫము వల్ల పుట్టే మూత్రాశయం నుండి మర్మాంగం వరకు వాపుకు కలుగజేసే మూత్రకృచ్చ వ్యాధి తగ్గిపోతుంది.  మూత్రం జిగురుగా పడుతున్నపుడు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది.

◆ వేడి పాలలో తగినంత బెల్లం, కొద్దిగా మిరియాల పొడి కలిపి రోజుకు రెండు లేక మూడు సార్లు తాగుతూ ఉంటే అన్ని రకాల మూత్రకృచ్చ సమస్యలు తగ్గదనే కాక, వాత సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.

◆ పాలలో చిటికెడు ఏలకులు పొడి, చిటికెడు ఇంగువ, ఒక చెంచా నెయ్యి కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే మూత్రకృచ్చ వ్యాధి క్రమంగా తగ్గిపోతుంది.

చివరగా……

ఆహారపు అలవాట్లు మరియు తీసుకునే ద్రవాహారాలు ఆరోగ్యకరమైనవి గా ఉంటూ, కాలాన్ని అనుసరించి లభించే పండ్లు మరియు ఆకుకూరలు తీసుకోవడం వల్ల, పైన చెప్పుకున్న చిట్కాలను పాటించడం వల్ల మూత్రకృచ్చ సమస్య పరిష్కారమవుతుంది.

Leave a Comment

error: Content is protected !!