చాలామంది మీల్మేఖర్ తినకూడదా అని డౌట్ పడుతూ ఉంటారు.వీటిని అసలు ఎలా తయారుచేస్తారు. అలాగే రోజు తింటే ఎలా ఉంటారు అని డౌట్ పడుతూ ఉంటారు అసలు ఈ మీల్మేఖర్ ఎలా తయారు చేస్తారు. అలాగే దీనివలన వచ్చే దుష్ప్రభావాలు తెలీదు అని భయపడుతూ ఉంటారు. మీల్మేఖర్ ఎలా తయారు చేస్తారు. దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. సోయాచంక్స్ ఎవరెవరు తీసుకోకూడదు. దీని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.
మిల్ మేకర్ స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్. దీని గురించి సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సోయాబీన్స్ నుండి తయారు చేస్తారు. సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన పిండిని సోయా చంక్స్ గా తయారుచేస్తారు. మీల్ మేకర్ అనే పేరుతో కూడా పిలుస్తూ వుంటారు. మీల్ మేకర్ ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళు దీన్ని తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మంచి నాన్ వెజ్లాంటి ఫ్లేవర్ ని ఇస్తుంది. కాబట్టి దీనితో ఎక్కువగా బిర్యానీలు, స్నాక్స్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు.
వెజిటేబుల్ బిర్యానీ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సోయాబీన్స్ లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మిల్మేకర్ లో 52 రాముల ప్రోటీన్ ఉంటుంది. 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాములు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని న్యూట్రీషియన్స్ పేర్కొంటున్నారు. నాన్ వెజ్ తినని వారికి మంచి ప్రోటీన్ ఫుడ్ కోడిగుడ్డు, చికెన్, పాలతో సమానమైన ప్రోటీన్ ఇందులో లభిస్తుంది.దీని వల్ల మీ శరీరంలో త్వరగా మెటబాలిజం రేటు పెరుగుతుంది. మజిల్స్ పెరగడానికి సహాయపడుతుంది. చర్మ కాంతిని పెంచుతుంది. ఎముకలు, వెంట్రుకలు బలంగా ఉండేలా చేస్తుంది.
ఇవి అధికంగా తీసుకునే వారిలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతున్నట్టు పరిశోధనల్లో తెలిసింది. గుండె పనితీరును మెరుగు పడేలా చేసింది. దీనిలో ఉండే రసాయనిక సమ్మేళనాలు శరీరంలో పెరిగి చెడు కొవ్వును కరిగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువు సమస్య తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అధికంగా తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ పెరిగే అవకాశం ఉంది. మగవారు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్లు ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి ఆడవాళ్ళ చాతి పరిమాణాన్ని కలిగి ఉంటారు.
ఆడవారిలో మామూలుగానే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీని వలన శరీరంలో నీరు పెరిగిపోయి వాపులు రావడం, ముఖంపై మొటిమలు, భావోద్వేగాలు అధికమవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీల్మేకర్ అధికంగా తీసుకుంటే మలబద్ధకం, వాంతులు అవడం సమస్యలు కూడా వస్తాయి. మూత్ర సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అతి ఎప్పుడు ప్రమాదకరం కనుక పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
Good