Medicinal and health benefits of Jowar

జొన్న కూడు అని చిన్న చూపు చూడకండి. నిజం తెలిస్తే షాక్ అవుతారు.

తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా తీసుకునే వాటిలో మొదట అన్నం, తరువాత చపాతీ లాంటి టిఫిన్లు ఉంటాయి. ఆయితే వీటితో చాలా పెద్ద సమస్యలే ఉంటాయి. బియ్యం, గోధుమలు మిల్లులో బాగా పాలిష్ చేసి తరువాత అమ్ముతారు. వీటివల్ల అందులో ఉన్న ఫైబర్ దాదాపు 80% కోల్పోతాము. ఇలా పాలిష్ అయిన గోధుమలలో అధిక స్థాయిలో గ్లూటెస్ ఉంటుంది. ఈ గ్లూటెస్ గోధుమలకు మెత్తదనాన్ని ఇస్తుంది. అయితే ఇందులో ఫైబర్ శాతం చాలా తక్కువ వుండటం వల్ల మరియు గ్లూటెస్ అందరికి సరిపడకపోవడం వల్ల జీర్ణాశయం దెబ్బ తింటుంది. అంతే కాదు పెద్దగా పోషకాలు కూడా ఉండవు.

అయితే శరీరానికి పుష్టి కలిగించడానికి ఉపయుక్తమైన అందరికి అందుబాటులో గల జొన్నలు అత్యుత్తమమైనవని చెప్పవచ్చు. ఒకప్పటి మన పెద్దలు  దీర్ఘాయుష్షుతో జీవించారంటే కారణం తీసుకునే ఆహారంలో జొన్న అన్నం భాగంగా చేసుకోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. జొన్న కూడు అని చిన్న చూపుగా ఈసడించుకున్నా ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు  చాలా విలువైనవి. 

ఎక్కువ పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే  స్థూలకాయం, షుగర్, ఛాతీ కి సంబందించిన సమస్యలు, గుండె జబ్బులు, గ్యాస్ ట్రబుల్, పేగు పూత లాంటి వ్యాధులు వస్తాయి.  వీటన్నిటికీ పరిష్కారంగా జొన్నలు ఉత్తమంగా పనిచేస్తాయి. జొన్నలు తీసుకోవడం వల్ల శరీర పుష్టి కలుగుతుంది కానీ లావు అవరు. దీని మూలంగా జొన్నలు తరచుగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు.

తెలుగు ప్రజలు వరిని  ప్రముఖ ఆహారంగా తీసుకున్న ఉద్దేశ్యం సింధూనాగరికథ కాలం నాటికే. మన తెలుగు వాళ్ళు వరితో పాటు జొన్నలు కూడా తిన్నారనే సాక్ష్యాలు బోలెడు ఉన్నాయి.

ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలు జొన్నలు ప్రధాన ఆహారంగా చేసుకుని తిన్న ఆధారాలున్నాయ్.  ముఖ్యంగా పేదవారికి ఖరీదైన ఆహారం దొరకడం అసంభవం. కనుకనే ఖరీదైన వాటి ద్వారా పొందలేని పోషకాలను జొన్నలు తీసుకోవడం ద్వారా భర్తీ అవుతాయి.

జొన్నలు మర పట్టించి పిండితో రొట్టెలు, జొన్న సంకటి, బెల్లము జోడించి  జొన్న లడ్డూలు, జొన్న కారప్పూస, జంతికలు, జొన్న అప్పాలు వంటి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒకటే రుచి గల పదార్థాన్ని రోజూ తిన్నట్టు కాకుండా రకరకాల రుచులను ఆస్వాదించినట్టు అవుతుంది.

ముఖ్యంగా జొన్నలు నూకగా తయారు చేసుకుని ఈ నూకతో అన్నం వండుకుని తరచూ తినడం వల్ల గొప్ప శారీరక పుష్టి కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి  జొన్న అన్నం లేదా జొన్నలతో తయారు చేసిన ఏ పదార్థాలైనా  ఆహారంలో ఇవ్వడం వల్ల  వారికి కావల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మరియు శక్తిని అందించినవారం అవుతాము.

చివరగా……

పైన చెప్పుకున్న విషయాలను బట్టి జొన్నలు చాలా గొప్పవైన మరియు సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉండే ధాన్యం. కాబట్టి తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!