సాధారణంగా మాంసాహారులు, శాఖాహారులుగా వర్గీకరించబడ్డ వారిలో శాఖాహారులు కొన్ని రకాల పోషకాలను కోల్పోతుంటారు.మాంసం, గుడ్లు మొదలైన వాటినుండి లభించే పోషకాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు అయితే సోయా బీన్ గొప్పగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు మరియు ఎముకలకు అవసరమైన అమైనో ఆమ్లాలు సోయాలో ఉన్నాయి. శరీరం ఆ సమ్మేళనాలను స్వయంగా తయారు చేయలేదు. సోయాబీన్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చూడండి మరి.
◆సోయాలోని చాలా కొవ్వులు పాలీఅన్‌శాచురేటెడ్, వీటిలో ముఖ్యమైన ఒమేగా -6 మరియు ఒమేగా -3 కొవ్వులు ఉన్నాయి. సమతుల్య ఆహారంలో భాగంగా, ఇవి గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చి కొన్ని వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
◆ అన్ని కూరగాయలు మరియు ధాన్యాల మాదిరిగా, సోయాలో కూడా కొలెస్ట్రాల్ ఉండదు. ఆహారంలో సోయా ను ప్రోటీన్ గా చేర్చుకోవడం వల్ల ఎల్‌డిఎల్ లేదా “చెడు” కొలెస్ట్రాల్‌ను 4% -6% తగ్గించవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఎంపిక కోసం సోయా ను తీసుకోవచ్చు.
◆ సోయాబీన్స్‌లో ఒక కప్పుకు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. సోయాలో అధిక ఫైబర్ ఇతర ఆహారాల నుండి లభించే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
◆ఒక కప్పు సోయాబీన్స్‌లో 886 మిల్లీగ్రాముల పొటాషియం ఉంది. ఇది మధ్య తరహా అరటిపండులో లభించే దాని కంటే రెట్టింపు, శరీరానికి రోజంతా అవసరమయ్యే వాటిలో మూడింట ఒక వంతు ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది శరీరం గుండె కొట్టుకోవడం, మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడం మరియు నరాలకు బలాన్ని చేకూర్చడం ఇలా చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
◆ శాకాహారులకు ఐరన్ రెట్టింపు కావాలి ఎందుకంటే కేవలం మొక్కలు ఆకు కూరలు ద్వారా సరిపడినంత ఐరన్ పొందలేరు. ఒక కప్పు సోయాబీన్స్‌లో 9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది రక్తం గుండా శరీరమంతా ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. పురుషులకు రోజుకు 8 మిల్లీగ్రాములు ఐరన్, మహిళలకు 18 మిల్లీగ్రాములు అవసరం.
◆ కొంతమంది మహిళలు మెనోపాజ్ తర్వాత ఎముక బలాన్ని కోల్పోతారు. మెనోపాజ్ చికిత్స చేయడానికి వైద్యులు ఈస్ట్రోజెన్‌ను సూచిస్తారు. సోయాలో సాధారణమైన ఐసోఫ్లేవోన్స్ అనే రసాయనం ఈస్ట్రోజెన్ యొక్క ప్రభావాన్నీ పెంచుతుంది. మెనోపాజ్ ఉన్న మహిళల్లో ఎముకలను బలోపేతం చేయడానికి ఐసోఫ్లేవోన్లు సహాయపడతాయని చెప్పవచ్చు.
◆మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నుండి రక్షించడానికి సోయా సహాయపడుతుంది. ప్రత్యేకించి ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలకు సోయాను ఆహారంగా ఇవ్వడం వల్ల. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను సగానికి తగ్గించగలదు. సోయాలోని ఫైటోన్యూట్రియెంట్ ఐసోఫ్లేవోన్ వాస్తవానికి క్యాన్సర్ కణితులను తగ్గించి క్రమంగా నిర్మూలిస్తుంది
◆ ప్రపంచవ్యాప్తంగా పురుషులలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్. సోయా తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఐసోఫ్లేవోన్లు, ప్రధానంగా జెనిస్టీన్ మరియు డైడ్జిన్ అని పిలువబడే రెండు, ప్రోస్టేట్‌లో కణితుల పెరుగుదలను నెమ్మదిగా ఆపుతాయి.
చివరగా….
వగరుగా ఉండే ఈ సోయా బీన్స్ ను తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల పై చెప్పుకున్న ప్రయోజనాలు అందరూ పొందవచ్చు