మనకు లేత పనసకాయను పై పోట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనకు బయట మార్కెట్లో అమ్ముతారు. ఈ ముక్కలను వెజిటేరియన్స్ అందరూ నాన్ వెజ్ ముక్కలుగా భావిస్తూ తీసుకుంటారు. మరియు పనస పొట్టును కూడా అమ్ముతారు. దీన్ని కూడా ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తుంటారు. ఈ పనస పోట్టును ఎండబెట్టి పొడిచేసి షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉండడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మరియు షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. షుగర్ ని తగ్గించే ఔషధాలు మరియు రకరకాల కాంపొజిషన్ పనసపొట్టు లో ఉంటాయని నిరూపించబడింది.
పనస కాయలు సీజనల్గా మాత్రమే లభిస్తాయి. తరువాత వాటిని మనం ఉపయోగించుకోలేము. అందువలన ఈ కాయలు దొరికినప్పుడే పొడి చేసి పెట్టి వాటి బెనిఫిట్స్ సంవత్సరం మొత్తం వాడుకోవచ్చని నిరూపించారు. 2021సంలో శ్రీకాకుళం గవర్నమెంట్ ఆఫ్ కాలేజ్ అండ్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్. వారు ఈ పనస పోడిపై రీసెర్చ్ చేశారు. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి తగ్గించడానికి మరియు షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి సహాయపడుతుందని పరిశోధనలు చేశారు. ఇప్పుడు పనస పొడి మార్కెట్లలో దొరకడం మొదలెట్టింది. ఓబైసీటి వలన వచ్చే డయాబెటిస్ మరియు ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే డయాబెటిస్ నుంచి ఇది విడుదల అందిస్తుంది.
వీటిలో ఔషధగుణాలతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఆహారం ద్వారా ప్రేగుల్లో తయారైన చెక్కర్ల ను రక్తంలోకి చేరకుండా ఫైబర్ పట్టుకుంటుంది. ఈ పొడి లో ఉన్న సైంటిఫిక్ ప్రాపర్టీస్ రక్తం లో ఉన్న చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఈ పొడిని రెండు మూడు రకాలుగా ఉపయోగించవచ్చు. 1.పుల్కలు చేసుకునే పిండిలో కలుపుకుని పుల్కాలు చేసుకొని తీసుకోవచ్చు. 2. ఈ పొడిని వేడినీళ్లలో కలుపుకొని తాగవచ్చు. 3. పనస పొడిని కూరల్లో కలుపుకొని వాండుకోవచ్చు.
ఇందులో ఉన్న కాంపౌండ్ రక్తంలో ఉన్న చక్కెరను కణంలోకి నెడుతుంది దీని వలన రక్తంలో చక్కెరల స్థాయి తగ్గుతుంది. రెండవదిగా పెద్దల్లో వచ్చే డయాబెటిస్ ఇది ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వలన వస్తుంది. ఈ పనస పోట్టు ఈ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. మరియు ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవడానికి కూడా సహాయపడుతుంది. మలబద్ధకం ఉన్నవారికి కూడా ఈ పనస పొడిని తీసుకోవడం వలన అందులో ఉన్న ఫైబర్ వలన దాని నుంచి విడుదల అందిస్తుంది. కనుక ప్రకృతి సిద్ధమైన ఇటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది….