ఆరోగ్యం పాడయితే రకరకాల మందులు వాడడం వాటివలన దుష్ప్రభవాలు వస్తుంటాయి. ఆయుర్వేదంలో కొన్ని మందులు ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మన ఇంట్లోనే పెరిగే కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందులో ఒకటి రణపాల. ఈ మొక్క ఆకులనుండి మళ్ళీ కొత్త మొక్కలు వస్తుంటాయి. సంప్రదాయ వైద్య విధానంలో ప్రముఖంగా వాడుతారు. ఈ మొక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, అనాఫిలాప్తిన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ అధిక రక్తపోటు, డయాబెటిస్, మూత్రవిసర్జన , మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించడం, శ్వాస కోస వ్యాధులు, అంటువ్యాధులు, గాయాలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తాయి. ఈ మొక్క వాస్తుపరంగా కూడా ఫ్రాధాన్యత కలిగింది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..
ఈ ఆకులతో టీ కూడా తయారుచేస్తారు. తిమ్మిరి, ఉబ్బసం వ్యాధులకు ఆయుర్వేదంలో మందులా వాడతారు. జలుబు దగ్గు సమస్యలతో పాటు శరీరాన్ని ధృడంగా చేయడంలో సహాయపడుతుంది. దీనికోసం ఈ ఆకులను నాలుగు తీసుకుని గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని టిఫిన్ కంటే ముందు తాగాలి.లేదా నాలుగు ఆకులను నమిలాలి. ఈ ఆకుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కిడ్నీ, గాల్ బ్లాడర్లోని రాళ్ళను చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటకు పంపేస్తుంది. నడుము నొప్పి, తలనొప్పి వచ్చినప్పుడు పేస్ట్ చేసి రాయడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకులలో మిరియాలు పెట్టి నములతూ ఉంటే ఫైల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా వారంరోజుల పాటు తినాలి. కడుపులో పుండ్లు, అల్సర్లు ఉన్నప్పుడు ఈ ఆకురసాన్ని తాగడంవలన మంచి ఫలితం ఉంటుంది. మద్యం వలన పాడయిన కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఆకులను పరగడుపున తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తుంది. కామెర్ల వ్యాధితో బాధపడేవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకు రసం తాగితే సరిపోతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యలక్షణాలను ఆలస్యం చేస్తాయి. ఆకు తినడంవలన క్రియాటిన్ తగ్గించుకోవచ్చు. డయాలసిస్ రోగులకు మూత్రపిండాలు పనితీరు మెరుగుపరుస్తుంది. అజీర్తి, మలబద్దకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆకు తినడంవలన జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు. రక్తంలో మలేరియా, టైఫాయిడ్ తగ్గుతుంది. గుండెసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. యూరోటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది కనుక రక్తంలో చీము, రక్తం పడడాన్ని నిరోధిస్తుంది. సెగగడ్డలు, చర్మసమస్యలకి ఈ ఆకుల పేస్ట్ చేసి రాస్తే తగ్గుతాయి.
Where can we get this ranaphala leaves please help me in this matter
Now da days lot of nurseries selling this RANAPALA plants. really Very very very very good plant…