ప్రతి ఇంటి కాంపౌండ్ లో అందంగా పెంచుకునే మొక్కల మద్యన అలరించే మొక్క కలబంద. చాలా మంది కలబంద అంటే జుట్టుకు పూసుకోవడానికి మొహానికి రాసుకోడానికి ఉపయోగిస్తారు. ఇంకొందరు ఆరోగ్య అవగాహన ఉన్నవాళ్లు అయితే అపుడపుడు కలబంద మట్టను కొద్దిగా కట్ చేసుకుని అందులో ఉన్న గుజ్జును తింటుంటారు. అయితే కలబందలో రసాయనికంగా అలాయిన్, గ్లైకోసైడ్ మిశ్రమంగా ఉండి బార్బలాయిస్, ఐసోబార్బలాయిస్, బి-బార్బలాయిస్ వంటి ఐసోమర్లు ఉంటాయి.

కలబంద ఆకులను నేత్రరోగాల నివారణ, అల్సర్ల నివారణ, చర్మవ్యాధులు నివారణ, కాలేయ వ్యాధులు, కుష్టు వ్యాధి, మొలలు, మానసిక రుగ్మతులలో వాడతారు. అలాగే కలబంద జెల్ ను చర్మసంబందిత ఉత్పత్తులలో విరివిగా వాడతారు. కలబంద అనుసంధానం చేసుకుని టూత్ పేస్ట్ లు, సబ్బులు, ఫేస్ క్రీములు, స్క్రబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. ఇన్ని చెప్పుకుంటున్న కలబందతో అద్భుతమైన రహస్యాల పరిష్కారాలు తెలుసుకుందాం.
◆ మూర్చలకు – తలనొప్పులకు
తాజా కలబంద గుజ్జు 50 గ్రాములు, తాజా పట్టుతేనే 100 గ్రాములు. అంటే కలబందకు రెండు వంతుల తేనెను తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఒక గాజుసీసాలో వేసి రెండురోజుల పాటు ఆ సీసా ను ఎండలో ఉంచాలి. తరువాత పలుచటి నూలుబట్ట తీసుకుని సీసాలో ఉన్న మిశ్రమాన్ని పడగట్టుకొని దాన్ని మరొక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. మూర్ఛ, హిస్టీరియా, తలనొప్పి మొదలైన సమస్యలు ఉన్నవారు ముక్కులలో రెందులేక మూడు చుక్కల కలబంద తేనె మిశ్రమాన్ని వేసుకుని లోపలికి పీల్చాలి. రెండు నుండి మూడు వారాలలో ఈ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుంతుంది
◆ ప్లీహరోగానికి (Enlargement of spleen)
రోజు పూటకు పది గ్రాముల కలబంద రసంలో మూడు గ్రాముల పసుపు వేసి కలిపి రెండు పూటలా సేవిస్తుంటే ప్లీహరోగం నయమవుతుంది.
◆ ఎక్కిళ్ళకు
ఎక్కువ ఎక్కిళ్ళతో బాధపడే వారు పది గ్రాముల కలబంద రసంలో రెండు గ్రాముల శొంఠి చూర్ణం వేసి కలిపి రోజుకు రెండు లేదా మూడు పూటలా తీసుకుంటూ ఉంటే ఎక్కిళ్ళు ఒకరోజుకే మాయమవుతాయి.
◆కడుపులో పుండ్లకు
కలబంద గుజ్జు, పాలు, నీళ్లు ఒక్కొక్కటి పది గ్రాముల చెప్పున తీసుకుని మూడు బాగా కలిపి. ఒకటి లేదా రెండు పూటలా తాగుతూ ఉంటే క్రమంగా కడుపులో పుండ్లు మానిపోతాయి. అయితే దీన్ని క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు చేయాల్సి ఉంటుంది.

◆ పైవి మాత్రమే కాకుండా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే కలబంద రసాయనం తయారీ విధానం చూద్దాం.
కలబంద రసం, నల్ల ఉప్పు, నీళ్లు కలపకుండా దంచి తీసిన అల్లం రసం, నిమ్మపండ్ల రసం. ఈ నాలుగు సమాన భాగాలుగా తీసుకుని గాజు సీసాలో పోసి గట్టిగా మూత పెట్టి ఆ సీసాను బియ్యం రాశి గా పోసి ఆ బియ్యపు రాశి మధ్యలో ఉంచాలి. పదహాయిదు రోజుల పాటు దాన్ని కదల్చకుండా అలాగే ఉంచాలి దీనివల్ల బియ్యం ఇచ్చే ఉష్ణానికి సీసాలో మిశ్రమం చర్య జరిగి మరింత ప్రభావవంతంగా తయారవవుతుంది. పదహాయిదు రోజుల తరువాత దీన్ని వడబోసి నిలువ ఉంచుకోవాలి. దీనిని పూటకు పది గ్రాముల చెప్పున రెండు పూటలా మంచినీళ్లతో కలుపుకుని తాగుతూ ఉంటే రక్తం స్వఛ్చమై శరీరం బలపడుతుంది. అంతే కాక కడుపులో గడ్డలు, పేగు సమస్యలు, అజీర్ణం వంటి సమస్త ఉదర సమస్యలు పరిష్కరించబడతాయి.
ఇన్ని ఉపయోగాలు ఉన్న కలబంద ను ప్రతి ఇంట్లో పెంచుకుంటూ ఆరోగ్యాన్ని సులువుగా పొందవచ్చని ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి.