Medicine for Gas Trouble Reduces Indigestion

కుంకుడు గింజంత ముద్దచేసి దీన్ని నీళ్లతో పాటు మింగితే గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది…

  ఇంగువ అనేది సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంగువని కొద్దిగా భోజనంతో పాటు లోపలికి పంపించగలిగితే మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి మొట్టమొదటిది ఇంగువ వాడినప్పుడు అది లోపలికి వెళ్లి మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంతమందికి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి పొట్టని ప్రేగులని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఈ యాసిడ్ ప్రొడక్షన్ అది ఉత్పత్తి కాకుండా రెగ్యులేట్ చేసి ఎంత అవసరమో అంతే ఊరి, ఎప్పుడు అవసరమో అప్పుడే ఊరుతుంది.

            ఇతర సమయంలో ఇర్రేగులర్గా సెక్రీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఇది నెంబర్ వన్ గా ఉపయోగపడుతుంది. రెండవది చూస్తే డైజేషన్ బాగా జరగడానికి లైపేజ్, ఎమైలేజ్ ఏంజెల్ సెక్రెషన్ బాగా పెంచి ఆహార పదార్థాలు పొట్ట ప్రేగుల్లో ఎక్కువసేపు ఉండకుండా ఇవి కిందకు తోసేస్తాయి. దీనివల్ల గ్యాస్టిక్ జ్యూసెస్ ఎక్కువ రిలీజ్ కావు. అంటే డైజెస్టివ్ ఎంజాయ్ ఎక్కువ రిలీజ్ చేయడానికి ఇంగువ ఉపయోగపడుతుంది. ఇక మూడవ చూస్తే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ఆస్పిన్ టాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ఇలాంటివారినప్పుడు పొట్ట ప్రేగుల అంచులు డామేజ్ అయిపోతాయి. ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా జరుగుతుంది.

            ఇలాంటప్పుడే గ్యాస్ట్రైటీస్, మంటలు, అల్సర్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పేగుల్ని ఏమీ చేయకుండా ప్రేగులు తట్టుకునేటట్టు మళ్లీ నార్మల్ గా అయ్యేటట్టు ఈ ఇంగువ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ మూడు ఇంగువను వాడుకోవడం వల్ల మన శరీరానికి జీర్ణక్రియకు ముఖ్యంగా కలిగే లాభాలు. మరి ఇంగువ ఎంత లాభాన్ని ఇస్తుంది అని ఎక్కువ వేసేస్తే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంగువని మనం ఎప్పుడైనా తాలింపుల్లో వాడుకోవచ్చు, నీళ్లు తడిపి కొంచెం కుంకుడు గింజంత ముద్దలా చేసుకుని మాత్రల మింగేస్తే చాలు ఇలాంటి ప్రయోజనాలు చక్కగా పొందవచ్చు.

             ఈ ఇంగువను తాలింపుల్లో వేడివేడిగా మరిగే నూనెలో మాత్రం వేయకూడదు. అలా వేస్తే కొన్ని కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి ఆ హీట్ కి డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి తగ్గుతాయి. లేదా ఈ ఇంగువను వంటల్లో చల్లుకోవచ్చు. ఇంగువను నీటిలో కరిగించి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!