Medicine for white hair to turn black

తెల్ల జుట్టును నల్లగా మార్చే పురాతన కాలపు ఆయుర్వేదిక్ రెమిడీ……. 55 ఏళ్లలో కూడా 20 లాగా కనిపించవచ్చు…

 ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్న సమస్య తెల్ల జుట్టు. ఇది నివారించుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ సమస్యలు పెంచుకుంటూ ఉన్నారు. కానీ ఎటువంటి ఫలితం ఉండడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆయుర్వేదిక్ రెమిడీ వలన మన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇందులో ఉపయోగించేవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ కావున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా జుట్టు పొడవుగా, ఒత్తుగా ఎదగడానికి ఈ రెమిడి బాగా సహాయపడుతుంది.

                దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. అందులో 100 గ్రాముల ఆవనూనెను వేసుకోవాలి. ఆవనూనె పడదు అనుకునేవారు దీనికి బదులు ఆముదం లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఆవనూనె మన జుట్టును కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా విడుదల అందిస్తుంది. మరియు జుట్టూ నల్లగా మారడానికి సహాయపడుతుంది. తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు మన జుట్టుకు చాలా మేలు చేస్తాయి. జుట్టు నల్లగా చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. మెంతులు వద్దు అనుకున్న వారు 10 ఎండు ఉసిరి ముక్కల్ని వేసుకోవాలి.

                తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ వాడవచ్చు. కాఫీ పౌడర్ జుట్టును నల్లగా చేయడంలో సహాయపడుతుంది. ఇది ఒక న్యాచురల్ కలర్ అని చెప్పవచ్చు. మరియు హెయిర్ స్మూత్ అండ్ సిల్క్ గా ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ ఉపయోగించాలి. ఇండిగో పౌడర్ మన జుట్టుకు నలుపు రంగు ఇస్తుంది. ఇది జుట్టుకు లోపల నుంచి ఔషధ గుణాలను అందిస్తుంది. మరియు స్ట్రాంగ్ గా చేస్తుంది. మరియు జుట్టు యొక్క పగుళ్లను నివారిస్తుంది.

                     మొత్తం వీటిని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమమును మూడు రోజులపాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత మన జుట్టుకు సరిపడా అంత నూనెను తీసుకొని జుట్టు మొత్తం అప్లై చేయాలి. ఇలా చేసిన రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. మాకు ఇబ్బంది లేదు అనుకున్న వారు ఉంచుకోవచ్చు. ఇలా వారానికి రెండు మూడు రోజులు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది…

Leave a Comment

error: Content is protected !!