Memory Boosting Laddu Protein Rich Recipe

అపారమైన మేధాశక్తిని, తెలివితేటలను పెంచే అతి బలమైన లడ్డు…

 బీట్రూట్ రక్తనాళాలను వ్యాకోచింప చేయడానికి, బీపీ ఉన్నవారికి తగ్గించడానికి, లేనివారికి రాకుండా చేయడానికి, రక్తనాళాలను ముడుచుకుపోకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి తెలివితేటలకు, మేధాశక్తికి, జ్ఞాపక శక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి అనేది ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నది. ఈ రెండిటి కాంబినేషన్తో హెల్తీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీట్రూట్ కోకోనట్  లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ముందుగా పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు, పాలు అర కప్పు, తేనె ఒక కప్పు, బీట్రూట్ రసం పావు కప్పు, జీడిపప్పు మొక్కలు 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి.    

          పిస్తా ముక్కలు వన్ టేబుల్ స్పూన్, బాదంపప్పు ముక్కలు వన్ టేబుల్ స్పూన్, ముందుగా మిక్సీజార్ తీసుకొని అందులో తురిమిన కొబ్బరిని వేసుకుని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది పొడి లాగా అవుతుంది దీనిని ఒక నాన్ స్టిక్ పాత్రలోకి తీసి దోరగా వేగనివ్వాలి. దీనిలో పాలు పోసేసి కొబ్బరిని ఉడకనివ్వాలి. తర్వాత పంచదారకి బదులుగా తేనె పోసేసి కొబ్బరిని బాగా ఉడకనివ్వాలి. కమ్మదనం కోసం జీడిపప్పు పొడిని కూడా కలపాలి. దీనిలో 40% పదార్థాన్ని చక్కగా పెట్టుకుని, మిగతా పిండిలో బీట్రూట్ రసం పోసి కలపాలి. ఇది కలర్ కోసం బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ వేపించడం కోసం కొద్దిగా మీగడ వేసి పిస్తా ముక్కలు, బాదంపప్పు ముక్కలు వేపుకోవాలి.

          వేగిన తర్వాత వీటిని కోకోనట్ లడ్డూ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇది లోపల స్టఫింగ్ ఉపయోగపడుతుంది. పైన బీట్రూట్ రసంతో చేసిన స్టఫ్ ని కవర్ల పైన వాడతాం. లోపల స్టఫింగ్ చిన్న సైజు ఉండలా చేసుకుని ఈ చిన్న లడ్డును కవర్ చేయడానికి పైన స్టఫింగ్ కి బీట్రూట్ రసం కలిపిన దానిని చుట్టుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ కోకోనట్ లడ్డూ తయారు చేసుకోవాలి. కొన్ని రకాల లడ్డులు తయారు చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగిస్తారు. ఇలా బీట్రూట్ తో చేయడం వల్ల నాచురల్ కలర్ వస్తుంది. అందువలన దీనిని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీనివల్ల వాళ్లకి చిన్న వయసులోనే బీపీలు రాకుండా జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండేలా ఆరోగ్యంగా ఉంటారు.

           ఇలాంటి హెల్దీ లడ్డును పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతో పెంచిన వాళ్ళం అవుతాము.

Leave a Comment

error: Content is protected !!