ఆడవారికి అయినా మగవారికి అయినా లైంగిక పరమైన అనాసక్తి అసమర్థత, ఉత్సాహం లేకపోవడం వంటివి అనేక కారణాల వలన ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అసంతృప్తి,ఆందోళనలూ, దిగులు మొదలైనవి మానసికంగా నలిపేస్తూ ఉంటాయి. వీటిలో నుండి బయట పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదని బాధపడేవారు మనం చెప్పుకోబోయే ఔషదాలను వాడుకుంటూ మనసులో భయం, అనుమానం, సందిగ్ధం వంటివి వదిలేస్తే అసమర్థత అనే సమస్య చాలా సులువుగా దూరమై తిరిగి నూతనోత్సాహం నిండుకుంటుంది. ఆ ఔషధాలు ఏమిటో చూడండి మరి.
◆ కుముదేశ్వర రసం లైంగిక శక్తిని పెంచడంలో ఆమోఘంగా పనిచేస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిలో ఏర్పడే అసమర్థత అనాసక్తుల్ని ఈ ఔషధం తరిమి కొడుతుంది. శరీరంలో హార్మోన్లను ఉత్తేజం చేసి లైంగిక శక్తిని కలిగిస్తుంది.
◆ మినుములు గూర్చి మన తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రేష్ఠమైన మినుములు మరపట్టించి ఆ పిండిని నేతిలో వేయించి చేసిన సున్ని ఉండలు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే శరీరం దృఢత్వం సంతరించుకుంటుంది. లైంగిక సామర్త్యాన్ని మెండుగా ఉంచుతుంది. మినుముల లాగే సగ్గుబియ్యం ను కూడా ఉపయోగించుకోవచ్చు.
◆ సాధారణంగా అందరికి అందుబాటులో ఉండే శనగలు ఆహారంలో వాడుకోవడం వల్ల కూడా లైంగిక సామర్థ్యము పెరుగుతుంది.
◆కోడిగుడ్డు, ఎండు ఖర్జూరపండ్లు, క్యారెట్ దుంపలు, దాల్చిన చెక్క, పిల్లి పీచర వేళ్ళు, అశ్వగంధ మొదలైన వాటికి లైంగిక సామర్త్యాన్ని పెంచే గుణం పుష్కలంగా ఉంది.
◆ పిల్లి పీచర వేళ్ళు, అశ్వగంధ వేళ్ళను దంచి పొడి చేసి ఈ పొడిని ఒక చెంచా మోతాదుగా పాలలో కలిపి తాగుతూ ఉంటే లైంగిక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అశ్వగంధ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
◆ దురద గొండి విత్తనాలను సేకరించుకుని ఆవు పాలలో వేసి బాగా ఉడికించి ఆ తరువాత ఎండబెట్టాలి. ఈ ఎండిన విత్తనాలను దంచి మెత్తని చూర్ణాన్ని తయారు చేసుకోవాలి. ఈ పొడిని అర చెంచా వరకు పాలలో కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది. శ్రీఘ్రస్థలనం వంటి సమస్యలు తగ్గుతాయి.
◆ కామాగ్ని సందీపని వటి అనే ఔషధం ఆయుర్వేద షాపుల్లో లభ్యమవుతుంది, దీన్ని రెండు పూటలా ఒక్కొక్కటి చెప్పున వాడుకుంటూ ఉంటే లైంగిక సమర్థత పెరుగుతుంది.
◆ ఇవి మాత్రమే కాకుండా లైంగిక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు, పాలు వంటివి నిత్యం తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల కోల్పోయిన సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది.
చివరగా…..
లైంగిక అసమర్థత అనేది శరీర పుష్టి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేహదారుఢ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి, అలాగే రోజువారీ వ్యాయామం, నడక, స్థిర చిత్తాన్ని కలిగేలా చేసే ధ్యానం వంటివి ఆచరిస్తూ పైన చెప్పుకున్నా ఔషధాలు వాడితే ఉత్తమ ఫలితం ఉంటుంది. ఈ ఔషధాలు వాడటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు, ఏ విధమైన భయం అక్కర్లేదు ఇవి దుష్ప్రభావాన్ని కలిగించేవి కాదు కాబట్టి వాడుకోవచ్చు.
I am suffering with verco venus please suggest me what can I take the medicine?