అందరిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో మైగ్రేన్ తలనొప్పి ఒకటి. చిన్న తలనొప్పిగా మొదలైనా దీని ప్రభావం మనిషి మానసిక పరిస్థితి మీద ఎంతో ప్రబహితం చూపిస్తుంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో అధికంగా వస్తుంది. మైగ్రేన్ వచ్చినవారికి వాంతులూ ఉండవచ్చు. తలలో విస్తరించిన రక్తనాళాలు అధికంగా ఒత్తిడికి లోనయినపుడు విపరీతంగా వాపు రావడం జరుగుతుంది. అలా వచ్చిన రక్తనాళాల ప్రభావమే మైగ్రేన్ తలనొప్పి.
చాలామంది పార్శ్వనొప్పి తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవేగానీ. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చుగానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ. ఈ పార్శ్వనొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ లేదు. కాకపోతే దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు మంచి చికిత్సలున్నాయి. ఇలా నియంత్రణలో ఉంచితే కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ మళ్లీ కొంతకాలం తర్వాత రావచ్చు.
ఇది రావడానికి కారణాలు:
◆పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు
◆డిప్రెషన్, నిద్రలేమి
◆కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల
◆అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
◆సాదారణంగా మహిళల్లో అధికంగా ఎదురయ్యే హార్మోన్ల అసమతుల్యత, నెలసరి వచ్చే ముందు కానీ లేక నెలసరి తరువాత కానీ ఈ మైగ్రేన్ లేదా పార్శ్వనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
◆గర్భధారణ సమయంలో, మహిళల్లో నెలసరి ఆగిపోయి మెనోపాజ్ వచ్చినపుడు మైగ్రేన్ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
ఇంత ఇబ్బంది పెట్టే మైగ్రేన్ సమస్యకు అద్భుతమైన ఇంటి నివారణ ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా ఎన్నో మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం ఉండటమే కానీ శాశ్వతంగా తగ్గని ఈ సమస్యకు అద్భుతమైన ఔషధంగా నువ్వులు ఉపయోగపడతాయి.
తెల్లనువ్వులు ఎన్నో విధాలుగా వంటింట్లో వాడుతూ ఉంటాం. అలాంటి తెల్ల నువ్వులు ఉదయాన్నే కాళీ కడుపుతో గుప్పెడు తినాలి. ఇలా క్రమం తప్పకుండా 21 రోజులు తింటే మైగ్రేన్ సమస్య మటుమాయం అవుతుంది. పైగా నువ్వులలో ఐరన్, కాల్షియం, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే ఇందులో మెగ్నీషియం కాన్సర్ దరిచేరనివ్వకుండా చేస్తుంది. ఇంకా జింక్ బలహీనంగా ఉన్న ఎముకలను కూడా ఉక్కులాగా మార్చడంలో సహాయపడుతుంది.
చివరగా….
పైన చెప్పుకున్న నువ్వులు వాడటం తో పాటు. ప్రతిరోజు వీలైనంత ధ్యానం, తాజా ఆహారం తీసుకోవడం. నచ్చిన పని చేయడం వంటివి చేస్తే మైగ్రేన్ మటుమాయం.