రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలపై అవగాహన కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి పెరిగింది. కానీ దానికోసం మార్కెట్లో దొరికే టాబ్లెట్స్, ఆహార పదార్థాలు వాడే బదులు మీ వంటగదిలోనే కాలానుగుణ సమస్యలకు చికిత్స చేసేటప్పుడు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడే పదార్థాలతో నిండి ఉందని మీకు తెలుసా?
పసుపు పాలతో, మిరియాల పొడితో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు, కాబట్టి ఈ రోజు మనం మరొక శక్తివంతమైన ఇంటి నివారణ – వెల్లుల్లి పాలు గురించి తెలుసుకోండి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండే వెల్లుల్లి పాలు ఎన్నో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి, ఇది సీజనల్ సమస్యలను దూరం చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది నిద్రపోయే ముందు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని మరియు పాలిచ్చే తల్లులకు తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఆయుర్వేద డాక్టర్స్ అభిప్రాయం ప్రకారం, “వెల్లుల్లి పాలు ఆయుర్వేదంలో సయాటికా, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, నడుము నొప్పి, దీర్ఘకాలిక మరియు పునరావృత జ్వరం వంటి అనేక రకాల పరిస్థితులకు చికిత్సగా ప్రస్తావించబడింది.”
వెల్లుల్లిలో ఉండే నీటిలో కరిగే మరియు కొవ్వులో కరిగే క్రియాశీల పదార్థాలు రెండూ మరిగే పాలకు బదిలీ చేయబడతాయి. “పాలు వెల్లుల్లి యొక్క వేడిని మరియు ఆరోగ్య ప్రయోజనాలును కూడా తగ్గిస్తుంది”
దీన్ని ఎలా తయారు చేయాలి?
కావలసినవి
1¼ కప్పులు – పాలు
4 – వెల్లుల్లి
2 స్పూన్ -తేనె
పద్ధతి
*వెల్లుల్లి రెబ్బలను వలిచి పైపొట్టు తీసేయాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పాలు మరగబెట్టండి.
*దానికి కట్ చేసిన లేదా చూర్ణం చేసిన వెల్లుల్లి ముక్కలను వేసి 5-7 నిమిషాలు పాలలో మరగనివ్వండి. మీరు కావాలనుకుంటే పసుపు కూడా జోడించవచ్చు.
*వెల్లుల్లి మెత్తబడే వరకు ఉడకబెట్టండి. గ్లాసులోకి పాలను తీసుకుని తీయదనం కోసం రెండు స్పూన్ల తేనెను కలపండి. తర్వాత వేడిగా తాగండి.
ఇలా తాగడం వలన అధిక బరువు, దీర్ఘకాలిక నొప్పులు నుండి ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.