Millet benefits and Types of millets in telugu

ఉక్కు లాంటి ఆరోగ్యమైన శరీరం కావాలంటే వీటిని వాడాల్సిందే!!

మనలో చాలా మందికి చిరుధాన్యాలు అంటే చిన్న చూపే. కానీ అవి మన ఆరోగ్యానికి శరీరానికి అవి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. తప్పనిసరిగా మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాము. చీటికీ మాటికీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తకుండా మన అనారోగ్య సమస్యలకు నివారణ మార్గం మనమే వెతుక్కోవచ్చు ఇలాంటివి పాటిస్తే.

◆ముఖ్యంగా రాగుల్లో అధిక బరువు తగ్గటానికి. ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉండడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇక వీటిల్లోని పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే.

◆ వీటిల్లో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.  క్షీణతను నివారించి ఎముకలు పెళుసుగా తయారయ్యి విరిగే ముప్పును తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

◆రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయిలు డయాబెటిస్ నివారించేందుకు తోడ్పడతాయి.

◆రాగుల్లో ని లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును అదుపులో ఉంచుతాయి. . ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో అసలు  కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది. రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.

◆రాగుల్లో ఉండే ఆమ్లాలు  శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి.అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యలు దరి చేరవు కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ రాగుల వాడకం ఉపయోగపడుతుంది.

◆రాగుల్లో ఉండే ఐసోల్యూసిన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది.  శరీర కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి శరీరంలో  నైట్రోజన్ క్రమబద్దంలో ఉంచడానికి సహాయపడుతుంది. 

◆రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణ లోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.

◆ రాగుల మొలకెత్తించి పొడి చేసిన పిండిని ఉదయం మజ్జిగ తొ గాని బెల్లం తొ గాని తీసుకొంటే అద్భుతమైన పోషకాలు పొందవచ్చు. ఇంకా రాగులతో ఎన్నో అద్భుతమైన వంటలు చేయొచ్చు రాగి దోసేలు. బిస్కెట్లు.  రాగి తోపా రాగి పిండి బెల్లం కలిపి అప్పాలు. రాగి పిండి ఇడ్లీలు ఇంకా చాలా రకాల పదార్థాలు చేయొచ్చు. 

◆రాయలసీమ రాగి సంకటి గురించి వేరే చెప్పాలా. వింటుంటేనే నోరూరించే రుచి కదా. రాగి అంబలి, లేదా రాగి జావ ఈ మధ్య ఆరోగ్యం దృష్ట్యా అందరూ తాగుతున్నారు. ఇందులో కాస్త మజ్జిగ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి. చాలాసేపటి వరకు కడుపు నిండినట్టుగా ఉండి ఆకలి అనిపించదు. మనని ఊబకాయం నుంచి రక్షించే ఆపద్బాంధవి కూడా రాగులు. 

చివరగా…..

 ఏ రకంగానైనా తీసుకునే సౌలభ్యం ఉన్న రాగులను. మన ఆహారంలో భాగం చేసుకుని రోగాలను దరిచేరనివ్వకుండా క్షేమంగా ఉందాం.

Leave a Comment

error: Content is protected !!