miracle health benefits of ranapla aaku

మనింటి పెద్ద డాక్టర్ ఈ మొక్క. మీ పెరట్లో ఉందా మరి??

పెరటి వైద్యం పనికిరాదు అనేది ఒకప్పుడు మాట కానీ ఇపుడు మన ఇంట్లో పెంచుకునే మొక్కలు మనకు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఆ కోవకి చెందినదే రణపాల మొక్క  ఈ మొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటిహిస్టామైన్ మరియు అనాఫిలాక్టిక్ లక్షణాలను కలిగి ఉంది.  అధిక రక్తపోటు, తలనొప్పి, గడ్డ, వాపు వంటి రోగాలకు ఇది మంచిది.  కాండం మరియు ఆకుల నుండి తయారైన టీని తిమ్మిరి, ఉబ్బసం కోసం ఉపయోగిస్తారు మరియు సైనస్ సమస్యలతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది.  మూత్రాశయాన్ని శుభ్రం చేయడానికి మరియు ప్రేగుల నుండి హానికరమైన విషాన్ని వదిలించుకోవడానికి కూడా ఇది వినియోగించబడుతుంది.  ఇన్ని చెప్పుకుంటున్న ఈ మొక్కను ఉపయోగించే విధానం ఏ జబ్బులకు ఎలా తీసుకోవాలో చూడండి.

కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది: మూత్రపిండాల డళ్లను కరిగించడానికి రోజుకు రెండుసార్లు 40-50 మి.లీ కషాయాలను ఇవ్వండి. ఇది కిడ్నీ లో రాళ్లను సులభంగా కరిగిస్తుంది.

మూత్రాశయ సమస్యలకు: మూత్రాశయ సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి  5 మి.లీ రసం ఇవ్వాలి..  ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

రక్తపోటు కోసం: రణపాల మొక్క రసాన్ని  5-10 చుక్కల వరకు తీసుకోవడం వల్ల .  రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

యోని రుగ్మతలకు: మహిళల్లో యోని సంబంధ వ్యాధుల్లో  , 2 గ్రాముల తేనెను  40-60 మి.లీ కషాయంలో కలిలి ఇవ్వాలి.  దీన్ని రోజుకు రెండుసార్లు ఇవ్వాలి

తలనొప్పి తగ్గిస్తుంది:  రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయాలి ఇది తలనొప్పిని నయం చేస్తుంది.

కంటి నొప్పి : రణపాల ఆకుల రసాన్ని కళ్ళ చుట్టూ లేపినం వేయాలి  ఇది కళ్ళ తెల్లగుద్దు భాగంలో నొప్పిని నయం చేస్తుంది.

గాయాలకు చికిత్స: ఈ ఆకులను కొద్దిగా వేడి చేసి, గాయం మీద కట్టాలి.  ఇది గాయం వేగంగా నయమవడంలో దోహదం చేస్తుంది  

రక్త విరేచనాలను నయం చేస్తుంది: 3-6 గ్రాములు ఆకుల రసం, జీలకర్ర మరియు  రెట్టింపు నెయ్యి కలపాలి. దీన్ని బాగా నూరి రోగికి రోజుకు మూడుసార్లు ఇవ్వాలి.  ఇది రక్త విరేచనాలను నియంత్రిస్తుంది.

పైల్స్(మొలలు) తగ్గిస్తుంది : పైల్స్(మొలలు) నుండి నివారణ పొందడానికి ప్రతిరోజూ రెండుసార్లు ఆకుల రసాన్ని త్రాగాలి.

కాలేయానికి మంచిది: రణపాల కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కామెర్లు ఉన్నవారు దీన్ని వాడటం వల్ల వేగంగ తగ్గించుకోవచ్చు..

కడుపు నొప్పి :  కడుపు నొప్పి ఉంటే ఈ ఆకుల కషాయాన్నీ తీసుకుంటే  నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

పేగుల్లో పురుగులకు : ప్రేగులలోని పురుగులను సమర్థవంతంగా తొలగించడానికి రణపాల సహాయపడుతుంది.  తేనెతో రోజుకు రెండుసార్లు ఈ ఆకుల కషాయం తీసుకోండి.

మంచి యాంటీ ఆక్సిడెంట్ : ఎండిన ఆకులతో టీ తయారు చేసి రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి..  ఇది ఫ్రీ రాడికల్స్‌తో బాగా పోరాడటానికి  సహాయపడుతుంది.

మధుమేహనికి : రణపాల ఆకులతో  డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.  ప్రతిరోజూ రెండుసార్లు ఈ మొక్క  కషాయాన్నీ తీసుకుంటే అద్భుతమైన రీతిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గడాన్ని చూడచ్చు 

మలబద్దకానికి : రణపాల మొక్క ఎండిన ఆకులను పొడి చేసి నిల్వ చేసుకోవాలి. దీంతో తయారుచేసిన టీని తీసుకోవడం ద్వారా మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది: మన శరీరంలో రక్తాన్ని శుద్దిచేయడానికి ఇది సమర్థవంతమైనది. మన శరీరంలో అంతర్గత విషపదార్థాలను తొలగించి  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మపు పుండు, బెణుకులు మరియు పురుగుల కుట్టడం  వంటి సమస్యల్లో 7 తాజా ఆకులను రుబ్బి ప్రభావిత ప్రాంతంలో పట్టులాగా వేయాలి. ఇలా చేయడం వల్ల తొందరగా సమస్యను తగ్గించుకోవచ్చు.  

చివరగా…..

పైన చెప్పుకున్న బోలెడు సమస్యలను నయం చేసే రణపాల మొక్క మీ పెరట్లో లేకపోతే ఇపుడే నాటేసుకోండి  లేకపోతే ఇన్ని రోగాలకు హాస్పిటల్ లో డబ్బులు పోయాల్సి వస్తుంది మరి

Leave a Comment

error: Content is protected !!