ప్రతిరోజు కూరగాయలు తరిగి కూరలు వండుకుని తింటూనే ఉంటాం. చాలామంది అన్నాము, కూరలు మోతాదు పరిశీలిస్తే అన్నం ఎక్కువ కూరలు తక్కువ తింటూ ఉంటారు. కారణం కూరల్లో వేసుకునే ఉప్పు, కారం మోతాదులు ఎక్కువగా ఉండటమే. శరీరానికి తగినంత పోషకాలు కూరగాయల నుండి అందాల్సిన మోతాదులో అందకపోతే చాలా మంది సూచించేది కూరగాయలతో జ్యుస్ చేసుకుని తాగమని. చాలామందికి ఇది విచిత్రంగా అనిపించినా కొన్ని రకాల కూరగాయలను నేరుగా తినగలిగే విధంగా ఉన్నవాటితో నిరభ్యరంతంగా జ్యూస్ చేసుకుని ఎంచక్క తాగేయచ్చు. దీనివల్ల ఫసిబర్ మినహాయించి అన్నిరకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అంతేకాదు ఫైబర్ లేకపోవడం మూలన తొందరగా రక్తంలోకి మరియు జీర్ణశయంలోకి వెళ్లి ఉత్తమ పలితాన్ని అందిస్తాయి.
కూరగాయల రసం తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
అధిక స్థాయిలో పోషకాలు అందుతాయి
కూరగాయలు అరకెజి ఉంటే వీటిని జ్యుస్ తీయడం వల్ల ఒక గ్లాసు స్వచ్ఛమైన జ్యుస్ అందుతుంది. దీని ద్వారా ఫైబర్ మినహా మిగిలిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
సులువుగా శరీరంలో కలిసిపోతాయి
కూరగాయల జ్యుస్ వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను గ్రహించేలా చేస్తుంది. కూరగాయలను వండుకోవడం నుండి నమలడం జీర్ణం చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అదే కూరగాయల జ్యుస్ తొందరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఈ ప్రక్రియ ఉత్తమంగా పనిచేస్తుంది.
సులభంగా తయారుచేసుకోవచ్చు
కూరగాయలను వండుకుని తినడం అనేది కాస్త పెద్ద ప్రాసెస్ కాబట్టి, వాటిని జ్యూస్ చేసుకొని మీ ఆరోగ్య అవసరాన్ని బట్టి రోజూ ఒక కప్పు తాగడం చాలా మంచిది ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రక్తంలో సులువుగా కలిసిపోయి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
శరీరానికి కావలసిన ద్రవపదార్థాల స్థాయి ఈ జ్యుస్ లతో కాస్త పెరుగుతుంది. తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే శరీర తత్వం కలిగిన వారికి కూరగాయల జ్యుస్ గొప్ప పలితాన్ని ఇస్తుంది.
సహజమైన పోషకాలు
శరీరానికి కావలసిన విటమిన్లు కొన్నిసార్లు జ్యుస్ ల రూపంలో తీసుకుంటూ బయట షాపుల్లో ఎక్కువగా ఖర్చు పెడుతుంటాం. అయితే సహజ విటమిన్లను నింపుకున్న కూరగాయల జ్యుస్ లు తీసుకోవడం వల్ల శరీరానికి సహజ పోషకాలు అందించిన వారం అవుతాము.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి బచ్చలికూర, బీట్రూట్లు, క్యారెట్లు మరియు ఉల్లిపాయలు మంచి ఎంపికలు. అందమైన జుట్టు కోసం వీటి జ్యూస్ తీసుకుంటూ ఉండాలి.
జుట్టు రాలడాన్ని ఎదుర్కుంటుంది
జుట్టు రాలడాన్ని నివారించడానికి ముదురు ఆకుకూరలు, క్రూసిఫరస్ కూరగాయలు ఉత్తమమైనవి. జుట్టు రాలడాన్ని ఎదుర్కోవటానికి ఈ కూరగాయల రసం తీసుకోవచ్చు.
మొటిమలు మరియు చర్మ సంరక్షణకు మంచిది.
గుమ్మడికాయలు, బ్రోకలీ, చిలగడదుంపలు, క్యారెట్లు చర్మానికి మంచివి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి కలిగిన కూరగాయల రసం తాగడం వల్ల మొటిమలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కాంతి వంతమైన చర్మం కోసం
చర్మానికి కూరగాయల రసం కాంతిని పెంచి ఆరోగ్యంగా చేస్తుంది. మెరుస్తున్న చర్మం పొందడానికి టమోటాలు, బంగాళాదుంపలు, క్యాబేజీలు, క్యారెట్లు మరియు ముల్లంగి రసం తీసుకోవచ్చు.
ముడుతలను నివారిస్తుంది
బ్రోకలీ, మిరియాలు, కాలీఫ్లవర్ మరియు టమోటాలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయల రసం తాగడం, విటమిన్ ఇ వంటి సెలీనియం కూరగాయల జ్యుస్ తీసుకోవడం వల్ల ముడతలు పోయి చర్మం యవ్వనంగా ఉంటుంది.
చివరగా….
జ్యుస్ అనేది ఉత్తమమైనదే అయినప్పటికీ ఆరోగ్యానికి ఫైబర్ కూడా అంతే ముఖ్యం కాబట్టి కేవలం జ్యుస్ లమీద కాకుండా కూరగాయలను కూడా తీసుకుంటూ ఉండాలి.
GOOD MSG