Moduga Chettu Uses in telugu

ఈ చెట్టులో రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం మీవంతు…..

ఇప్పటిలాగా ఎన్నేసి రకాల టాబ్లెట్లు, టానిక్ లు ఉన్నాయా ఒకప్పుడు. ఏదైనా జబ్బు అనిపిస్తే దగ్గర్లో ఉన్న చెట్టులో ఔషధ గుణాలు గుర్తుపెట్టుకుని వాటిని ఉపయోగించి జబ్బులను  నయం చేసుకునేవారు. అయితే కాలం తో పాటు ఆ వైద్యం తగ్గిపోతున్నా….. ఆ చెట్ల లో ఔషధ గుణాలు మాత్రం అప్పటిలాగానే ఉన్నాయి. శాశ్వత పరిష్కారాలను ఇచ్చే ఆయుర్వేదంలో అద్భుతమైన  చెట్టు మోదుగ చెట్టు. మరి మోదుగ చెట్టు ప్రయోజనాలు, ఉపయోగించుకోవలసిన విధానం ఒకసారి చూద్దాం. చూసి ఆచరిద్దాం.

సాధారణంగా యజ్ఞాలు, యాగాలు జరిగే చోట మోదుగచెట్టును హోమద్రవ్యంగా వాడతారు. మోదుగలో ఔషధ గుణం నెయ్యిలో మండటం వల్ల ద్విగుణీకృతం చెంది యాగాలలో వెలువడే పొగ పీల్చడం వల్ల అనేక జబ్బులు నయమవుతాయి. ఈ మోదుగ చెట్టు బెరడు కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. దీన్ని ఔషధంగా తీసుకోవడం వల్ల ప్లీహ రోగాలు, శ్లేష్మ రోగాలు, మూల వ్యాధులు నయమయిపోతాయి.

Butea Monosperma – Moduga Flower

నీళ్ళ విరేచనాలకు

ఆహారం కలుషితం అవ్వడం వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయి. అయితే మోదుగ చెట్టుకు ఏర్పడిన జిగురును ఎండించి దంచి పొడి చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పది గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు రెండింటిని బాగా కలిపి దీన్ని తొమ్మిది భాగాలుగా విభజించుకోవాలి. సులువుగా చెప్పాలంటే అరస్పూన్ అంత మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు మూడు పూటలా ఆ మిశ్రమం అయిపోయేవరకు వాడితే నీళ్ల విరేచనాలు సమస్య పూర్తిగా నివారించబడుతుంది.

మొలలకు

ఇప్పట్లో అందరూ ఎక్కువ ఇబ్బంది పడుతున్న సమస్య మొలలు. దీన్నే ఇంగ్లీష్ వైద్యంలో ఫైల్స్ అంటారు. ఆపరేషన్ తప్ప నివారణ లేదు అని చెప్పే ఈ సమస్యకు మోదుగ మంచి పరిష్కారం.మోదుగ చెట్టు కాడలను తెచ్చి మెత్తగా నూరి మొలల మీద వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే మొలలు ఊడిపోతాయి. 

తేలుకాటు కు

మోదుగ గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట రాయాలి.  దీనివల్ల తేలు కుట్టినపుడు కలిగే నొప్పి తొందరగా తగ్గిపోతుంది.

ఉబ్బసం రోగాలకు

మోదుగ చెట్టు జిగురును దంచి పొడి చేసుకుని రోజు రెండు పూటలా, పూటకు రెండు గ్రాముల చూర్ణాన్ని మంచినీళ్లతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉబ్బస రోగాలు నయమవుతాయి.

మధుమేహానికి

మోదుగ ఆకులు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళకు షుగర్ లెవల్స్ క్రమబద్దీకరిస్తాయి.

మూత్రంలో మాత్రమే షుగర్ సమస్య ఉన్నవాళ్ళకు మోదుగ ఆకుల పొడి చక్కని పరిష్కారం

నులిపురుగులకు

చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్య దేనికి లొంగకుండా మొండిగా ఉన్నపుడు మోదుగ విత్తనాల పొడిని తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య నివారించబడుతుంది.

మాత్ వాష్

మోదుగ ఆకులను కషాయం గా చేసి గోరువెచ్చగా ఉన్నపుడు నోటిని పుక్కిలించడం వల్ల నాచురల్ మౌత్ వాష్ లా పనిచేస్తుంది.

చివరగా…..

ముఖ్న చుట్టూ పెరిగే చెట్లలో సాధారణంగా కనిపించే మోదుగలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాడి మన జబ్బులను దూరం చేసుకుందాం. 

Leave a Comment

error: Content is protected !!