Monkeypox Symptoms Monkeypox Treatment

మంకీ పాక్స్ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది

మంకీ పాక్స్ ఈ మధ్య కాలంలో అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా వైరస్, హెపటైటిస్  వైరస్ వంటి వైరస్ లా కాకుండా మంకీ పాక్స్  చాలా  తీవ్రంగా ఉంటుంది. మంకీ పాక్స్ ఆఫ్రికాలో మొదలైంది.  ఆ చుట్టు పక్కల దేశాలలో కూడా ఎక్కువగా ఉంది. కోతులలో ఉండే వైరస్ మనుషులకు సోకడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ సోకిన వారికి కొద్ది రోజులు ఒళ్ళంతా పొక్కులు రావడం జరుగుతుంది. చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ వచినట్లుగానే మంకీ పాక్స్ కూడా వస్తుంది.

      ఈ వైరస్ వలన వచ్చిన పొక్కులు రెండు వారాలకు పూర్తిగా మాడిపోతాయి. ఈ మంకీ పాక్స్ కి సంబంధించి మూడు రకాల వైరస్ లు ఉంటాయి. వాటిలో స్మాల్ పాక్స్ ఒకటి. 1978-79 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ను నిర్ములించగలిగాము.  ఈ వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. ఏ జంతువులలో ఉండదు. కాబట్టి దానికి  వ్యాక్సిన్ కనిపెట్టడం కూడా ఈజీ అయింది. ప్రపంచవ్యాప్తంగా అప్పుడే పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి స్మాల్ ఫాక్స్ కు సంబంధించిన వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది.

    అందువలన స్మాల్ పాక్స్ ను పూర్తిగా నిర్ములించగలిగాము, రూపుమాపగలిగాము. రెండవది చికెన్ పాక్స్ ఇది అందరికి వస్తుంది. చికెన్ పాక్స్ కి కూడా ప్రస్తుతం వాక్సిన్ అందుబాటులో ఉంది.చికెన్ ఫాక్స్ ఒకసారి వస్తే మళ్ళీ జన్మలో రాదు. ఈ వైరస్ తగ్గిపోయినప్పటికీ నరాల మధ్యలో దాక్కుని కొన్ని సంవత్సరాల తర్వాత నొప్పి, వాపు వంటివి రావడం జరుగుతుంది. ఇది ప్రాణాంతకం ఐతే కాదు.ఈ స్మాల్ ఫాక్స్, చికెన్ పాక్స్ లాంటిదే మంకీ పాక్స్ కూడా స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్ కి అవసరమైన ఆంటీ జెనిక్స్తోనే  మంకీ ఫాక్స్ కి  కూడా ఇవ్వవచ్చు.

       గత 20 ఏళ్లుగా చిన్న పిల్లలకు కూడా స్మాల్ పాక్స్ వాక్సిన్ ఇవ్వడం మానేశారు. మళ్ళీ స్మాల్ పాక్స్ విజృంభిస్తే కనుక ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల ప్రాణాలు పోతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది. స్మాల్ పాక్స్ కి సంబంధించిన భయం ఊహల్లోనే ఉంది. ఇప్పటివరకు ఐతే మళ్ళీ రాలేదు. ఈ మంకీ  పాక్స్ 16వేల నుండి 20వేల మందికి రావడం, మన దేశంలో కూడా మంకీ పాక్స్ కేసులు రావడం జరిగింది. ఇంకొద్ది రోజుల్లో ప్రపంచ నలుమూలల్లో మంకీ పాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

      మంకీ పాక్స్ ఒకరి నుండి ఒకరికి రావడం, దెబ్బ తగిలినప్పుడు రావడం, సెక్స్ వలన వ్యాపించడం జరుగుతుంది. మంకీ పాక్స్ ఉన్నవారు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మాస్క్ ధరించడం మంచిది. ఈ వైరస్ కూడా శానిటైజర్ వాడటం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన వ్యాప్తిని నిరోధించవచ్చు. మంకీ పాక్స్, చికెన్ పాక్స్ వచ్చిన వారి దగ్గరకి చిన్నపిల్లల్ని, వయసు మీరిన వారిని అసలు తీసుకెళ్లవద్దు. మంకీ పాక్స్ వలన ప్రాణాలు ఐతే పోవు.  దీనికి వాక్సిన్ స్మాల్ పాక్స్ కి వేసే వాక్సిన్ ఇస్తున్నారు. మంకీ పాక్స్ వచ్చిన చికెన్ పాక్స్ వలె 2-3వారాలలో మాడిపోతాయి.

Leave a Comment

error: Content is protected !!