Morning Drinks For Weight Loss

పొట్ట దగ్గర కొవ్వు మొత్తం కరిగి పోవాలంటే

మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.చాలామంది బరువు తగ్గాలి అని అనుకుంటారు కానీ తగ్గలేరు. అధిక బరువు వల్ల ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ బ్లాకేజెస్,  రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వంటి చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవడం చాలా అవసరం.  అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది  సర్జరీలు, రకరకాల మందులను వాడుతూ ఉంటారు.

అధిక బరువును తగ్గించుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క. ఒక గిన్నె తీసుకొని దానిలో  50 గ్రాములు ధనయాలు,  50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాములు సోంపు, 50 గ్రాముల మిరియాలు, ఒక మూడు ఇంచుల దాల్చిన చెక్క. ఈ  పదార్థాలన్నింటినీ సమాన మోతాదులో తీసుకోవాలి. ఈ పౌడర్ ను కొంచెం  కొంచెం కాకుండా ఎక్కువ ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 

 ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకుని  గాజు సీసాలో పెట్టినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి  ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక  స్పూన్  తయారు చేసుకున్న పౌడర్ వేసి  బాగా కలుపుకోవాలి. ఈ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని చల్లార్చుకోవాలి. ఈ నీళ్లు  గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులో తీసుకొని  రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి.

ఇలా చేయడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతుంది. దాల్చిన చెక్క బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మిరియాలు  కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. సోంపు, జీలకర్ర, ధనియాలు జీర్ణ సమస్యలను తగ్గించి ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరగదు. అధిక బరువును తగ్గిస్తాయి.

రోజు ఈ కషాయాన్ని తీసుకుంటూ డైట్ ను కూడా ఫాలో అవ్వాలి. రోజు వ్యాయామం కూడా తప్పనిసరి. ఈ కషాయాన్ని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. ఈ కషాయం రోజు తీసుకోవడం వలన రక్తం రక్తనాళాల్లో బ్లాకేజెస్, హార్ట్ ఎటాక్, హార్ట్ బ్లాకేజెస్  వంటివి రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. 

Leave a Comment

error: Content is protected !!