మన శరీరం అనేక అవయవాల సముదాయము,ఈ అవయావాలన్నీ అనేక కోట్ల కణాల సముదాయము. మరి కణాలన్నీ జబ్బు పడకుండా రక్షించుకుంటు ఉంటే. అవయవాలు జబ్బుల బారినపడకుండ ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే, శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టే. అందుకని మొత్తంగా చూస్తే కణం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కణాలు రిపేర్ చేసుకోవాలన్నా, శుభ్రపర్చలనుకున్న, జబ్బు పడకుండా ఉండాలన్నా ఇవన్నీ ఆటోమ్యాటిక్ మెకానిజమ్ కలిగి ఉన్నాయి. మరి ప్రతి కణము ఇలాంటి పనులన్నీ చేసుకొని ఆరోగ్యకరంగా జీవించాలి అంటే, వాటిని రక్షించుకొడానికి ఉపయోగపడే యాంటీ-ఆక్సిడెంట్స్ ఉత్పత్తి జరగాలి.
యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి.!
నానా రకాల వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించేవి,-కణాల శుభ్రత మరియు పునరుత్పత్తిలో యాంటి-ఆక్సిడెంట్స్ అద్భుతంగా ఉపయోగ పడుతుంది.
బయట పొల్యూషన్ నుంచి, కెమికల్స్ రియాక్షన్స్ నుంచి, హాని కలిగించే వాతావరణం నుంచి రక్షణ కలిగించే గుణం యాంటి ఆక్సిడెంట్స్-లో ఉంటాయి. ~యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోవడానికి కారణాలు.
బయట ఆహారం తీసుకోవటం,-అతిగా ఉడికించిన, వేపిన ఆహార పదార్థాలు తినడం, -ఇన్స్టంట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ యాంటీ-ఆక్సిడెంట్స్-ను డి-ఆక్టివేట్ చేస్తాయి. -యాంటి ఆక్సిడెంట్స్ విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది, మరియు జబ్బులు విజృంభిస్తాయి. -యాంటి ఆక్సిడెంట్స్-ను శరీరంలో ఆక్టివేట్ చేయడానికి మునగాకు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. -మునగాకులో అనేక మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటాయి. – మునగాకులో రెండు ముఖ్యమైన యాంటి-ఆక్సిడెంట్స్ ఉంటాయి,1-క్వార్సేటిన్, 2- క్లోరోజెనిక్ ఆసిడ్.ఇవి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిని ఎక్కువ చేయటానికి సహాయపడుతుంది.
మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి.!
ఉదయం గోరు వెచ్చని నీళ్లలో 7గ్రాము మునగాకు పొడి మరియు తేనె కలిపి తాగాలి. -మళ్ళీ సాయంత్రం 7 గ్రాముల పొడిని గోరు వెచ్చని నీటిలో తేనె వేసి తాగాలి.మొత్తానికి రోజుకి 14గ్రాముల పొడి, మూడు నెలలు తప్పకుండా ఇలా తాగడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ 44% వరకు హెచ్చుతుంది అని పంజాబ్ యూనివర్సిటీ వారు 2014 లో చేసిన అధ్యయనం ద్వారా కనుగోన్నారు.-దోశ,చపాతీ, రొట్టే పిండిలో రెండు స్పూన్ మునగాకు పొడిని కలిపి వాడుకోవచ్చు. వెజిటబుల్ మరియు ఫ్రూట్ జ్యూస్-లో కూడా 7గ్రాముల పొడి కలుపుకొని తాగవచ్చు.
ఇన్ని విలువలు ఉన్న మునగాకు పొడిని రోజు వంటల్లో వాడటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.