అధిక బరువు సమస్యలు ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరగడం అనేది మనకు తెలియకుండా పెరిగిపోతుంది గానీ తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బరువు తగ్గించే వ్యాయామాలు, కొవ్వు లేని ఆహార పదార్థాలు తినడం ఈ బరువు తగ్గడం అనే పనిని కష్టతరం చేస్తాయి. మీరు కొంచెం బిజీ అయినా కొన్ని చిట్కాలు ఈజీగా బరువు తగ్గేందుకు మీకు సహాయపడతాయి.
దానికి మనం తినే ఆహారంలో మైదా, స్వీట్లు వంటివి తగ్గించి మొలకలు, పండ్లు, బాదం వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ప్రతి నాలుగు గంటలకు కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవడం వలన శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎక్కువగా ఉదయాన్నే ఆలస్యంగా లేచే వారిలో ఊబకాయం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా లేవడం అలవాటుగా మార్చుకోవాలి.
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు, లో ఫ్యాట్ చీజ్, కొన్ని బాదాములు, ఆపిల్ వంటివి మూడు, నాలుగు గంటల విరామాల మధ్య తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. దీనివలన శరీరంలో ఉండే శక్తి నిల్వలు పెరిగి అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వలన కూడా ఆహారం బాగా జీర్ణమై కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. సోడియం తక్కువగా ఉండే సముద్రపు ఉప్పును ఆహారంలో తీసుకోవాలి.
జీర్ణవ్యవస్థకు నష్టాన్ని కలిగించే కొవ్వు పేరుకునే ఆహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మోనోసాచురేటెడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. క్యాల్షియం అధికంగా ఉండే పాల సంబంధిత పదార్థాలు తీసుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. అందుకే రోజుకు సరిపడా కాల్షియం ను ఆహారం ద్వారా తీసుకోవాలి. మన రోజూ తీసుకునే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండాలి. వెల్లుల్లి శరీరంలో కొవ్వును కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
రోజు ఒక వెల్లుల్లి రెబ్బ తింటే చాలా మంచిది. అలాగే వారానికి ఒక్కసారైనా చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిని పచ్చిగా తినలేనివారు వాటి పొట్టు తీసేసి ఒక పాన్ లో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో ఒక స్పూన్ తేనె కలపాలి. వెల్లుల్లి రెబ్బలను రోజుకు ఒకటి బాగా నమిలి తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా కనీసం ఏడు రోజుల పాటు చేయడం వల్ల శరీరంలో అధిక కొవ్వు సమస్యను తగ్గించుకోవచ్చు.