most haunted fort in India Bhangharh fort

భారత ప్రభుత్వం సైతం ఇక్కడికి వెళ్లడానికి భయపడుతుంది

భంగర్ ఫోర్ట్ అనేది 17వ శతాబ్దంలో మాన్ సింగ్ I తన మనవడు మధో సింగ్ కోసం నిర్మించిన పాత కోట.  ఇది రాజస్థాన్ లోని అల్వార్లో ఉంది ఈ కోట ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది, అయితే ఈ కోట గురించిన అనేక విషయాలు ఈ కోటను సందర్శించాలనే మీ ప్రణాళికలను పునరాలోచించేలా చేస్తాయి.  మీరు అక్కడికి వెళ్లే ముందు ఈ కోట గురించి తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. చీకటి పడిన తర్వాత కోటలోకి ఎవరినీ అనుమతించరు అనేది వాస్తవం. స్థానికులు మరియు మరికొందరు యాత్రికులు కోటలో రాత్రి బస చేయడానికి ఎంచుకున్నారు కానీ మరుసటి రోజు దాని నుండి బయటకు రాలేదని భాంఘర్ స్థానికులు అనేక కథలను వివరిస్తారు.  రాత్రి పూట కోటలోకి ప్రవేశించకూడదని ప్రభుత్వం చాలా సైన్ బోర్డులను విధించింది.  ప్రధాన ద్వారం రాత్రి తాళం వేసి మరుసటి రోజు ఉదయం మాత్రమే తెరుస్తుంది.

 పురాణం ఏమిటంటే, భాంగర్ కోట ఉన్న ప్రదేశంలో గురు బాలునాథ్ అనే సాధువు తపస్సు చేసుకునే ఆశ్రమం ఉండేది.  అయితే అకస్మాత్తుగా రాజు మాన్ సింగ్ గురు బాలునాథ్ స్థలంలో కోటను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.  కోట నీడ తన ప్రదేశంలో తాకదని, అలా చేస్తే గ్రామం మొత్తం నాశనమైపోతుందని  గురు బాల నాథ్‌ చెప్పాడు. రాజు అలా జరగనివ్వనని సాధువును ఒప్పించాడు.  కోట కట్టబడినప్పుడు నీడ అతనిని తాకడం వలన ఆ కోట దెయ్యాల దెబ్బగా మారి పోవాలని సాధువు శాపమిచ్చాడు. అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఆ కోటలో యువరాణి రత్నావతి ని చూసి  ఒక మాంత్రికుడు ఇష్టపడ్డాడు. ఆమెను తన వశం చేసుకోవడానికి మంత్రాల నూనెను ఆమెపై వేయాలని తన శిష్యుణ్ణి కోటకు పంపించాడు. ఆ శిష్యుడు తనపై నూనె వేయడం గమనించి యువరాణి అతడిని తోసేసింది. ఆ నూనె నేలపాలు అయ్యింది. మాంత్రికుడు అతని శిష్యుడు రాళ్లుగా మారిపోయారు. అయితే మాంత్రికుడు ఇచ్చిన శాపం కారణంగా రాజ్యం మొత్తం నాశనమై రాజ్యంలో దెయ్యాలు తిరుగుతాయని ప్రజలు నమ్ముతారు.

 కోట వద్ద రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు కుర్రాళ్ల కథ ఉంది, కోటలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, అక్కడ ఉండే నైట్ వాచ్మెన్కు కొంత డబ్బు ఇచ్చి లోపలికి వెళ్లారు. అయితే నైట్ వాచ్మెన్ 6 దాటిన తరువాత లోపల ఉన్న సోమేశ్వరాలయంలో పడుకున్నాడు. ఇంత పెద్ద కోట లో ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే కొంత సేపటి తర్వాత నుండి ఇక్కడ అనేక రకాల అరుపులు వినిపిస్తాయి. వాటికి స్పందించి బయటకు వెళితే వారిని తిరిగి చూడలేము అని చెబితే వారు నమ్మలేదు. కానీ రాత్రి అయ్యే కొద్దీ అక్కడ అనేక రకాల శబ్దాలు వినిపించడం మొదలైంది. అలాగే తమ ఇంట్లో వారి గొంతుతో పిలవడం కూడా వారు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తల్లి పిలిచినట్టుగా పిలవడంతో మిగతావారు మీ అమ్మ పిలుస్తుంది అని చెబితే ఆమె చనిపోయి మూడు సంవత్సరాలు అయింది అని చెప్పడంతో వారంతా భయంతో గుడిలోపల దాక్కున్నారు. రాత్రంతా అలాంటి శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఆ గుడి పూజారి వచ్చేంతవరకు వారంతా అక్కడే పడుకున్నారు ఇది అక్కడకు వెళ్లిన కొంతమంది చెప్పిన కథనం.

 ఈ కోటలో గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పరిశోధనలు చేసినా పురావస్తు శాఖ వారు ఈ కోటలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అలాగే గబ్బిలాలు నివాసం ఏర్పరచుకోవడం వల్ల విపరీతమైన వాసన వస్తుందని చెప్పారు. వీటివలనే మరణాలు జరుగుతుండవచ్చని చెప్పారు. అలాగే ఇక్కడ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని కూడా కొన్ని పరిశోధనలు తెలిపాయి. ఈ భాంగర్ పోర్ట్ దేశంలోనే మొదటి భయానక ప్రదేశంగా ఉంది. ప్రభుత్వం కూడా ఇక్కడికి రాత్రిపూట రాకూడదని అనేక రకాల సైన్ బోర్డ్స్ పెట్టింది.

Leave a Comment

error: Content is protected !!