Most Powerful Khichdi Strength Weight Loss

మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఒకే దగ్గర! అది ఏమిటి అంటే……

మన శరీరం దృఢంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే రక్షణ వ్యవస్థ బాగుండాలి అంటే అనేక పోషకాలు మనకు కావాలి. అందులో ముఖ్యంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, విటమిన్స్. ఇవన్నీ మనం తినే ఆహారంలో ప్రతిరోజు కావాలి. కాబట్టి వీటన్నింటినీ కలిపి ఒకే వండితే అది ఆల్ ఇన్ వన్ కిచిడీ అవుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా కొర్రలను తీసుకోవాలి దీనిలో కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా చూసుకుంటాయి.

                       ఇక రెండవది గుప్పెడు పెసరపప్పు తీసుకోవాలి, దీనితో పాటు పచ్చి బఠాణి తీసుకోవాలి, సోయా చిక్కుడు నానబెట్టి వేసుకోవచ్చు లేదా రాజ్మా గింజలను కూడా నానబెట్టి వేసుకోవచ్చు వీటితో పాటు స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ కూడా ఉన్నాయి 10 – 25% కొవ్వులు ఉన్నాయి. ఇవన్నీ ఉడకడానికి నీటికి బదులుగా నాలుగైదు టమాటాలు తీసుకుని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ప్యూర్ జ్యూస్ ని తీసుకోవాలి. ఈ టమాటా రసంతో ఈ గింజలను ఉడికించాలి. దీంతోపాటు పాలకూరగానీ, గోంగూర గాని, చుక్కకూర గాని, తోటకూర గాని, బచ్చలకూర గాని ఏదో ఒక ఆకుకూర యాడ్ చేస్తూ ఉండాలి.

                      సూక్ష్మ పోషకాల కోసం ఈ ఆకుకూరను తీసుకోవాలి వీటిలో ఐరన్, క్యాల్షియం, జింక్ ఫాస్ఫరస్ మొదలైనవన్నీ ఉంటాయి. దీంతోపాటు వెజిటేబుల్ ముక్కలలో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు కొన్ని వేసుకోవాలి. దీంతోపాటు బీన్స్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు. వీటితోపాటు ఇంకేమైనా కూరగాయలు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కావలసినవి పచ్చిమిరపకాయలు కూడా వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. వెయ్యాలి అనుకుంటే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఉప్పు లేదు అనిపించకుండా మంచి టేస్ట్ ఇస్తాయి.

                     ఇవన్నీ ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము గాని లేదా ఎండి కొబ్బరి తురుము గాని పైన చల్లుకోవాలి. కొద్దిగా మిగడ వేసి తాలింపు పెట్టుకోవాలి దీనిలో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి అవిస గింజల కారంపొడిగాని వేరుశనగల కారంపొడి గాని కలుపుకొని తినొచ్చు. దీనికి పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నం వండుకోక్కర్లేదు కావలసిన పోషకాలు అన్ని వెళతాయి.

Leave a Comment

error: Content is protected !!