ఇంట్లో ఒకరికి క*రోనా వస్తే మిగతా వాళ్ళంతా ఎలా ఉండాలి. మొదటి దశలో ఒకరికి క*రోనా వస్తే అందరూ విడిగా ఉంటూ వారిని ఒక రూమ్లో ఐసోలేటెడ్ చేసేవారు. రెండవ దశలో డాక్టర్ కి ఫోన్ చేసే సమయానికి ఇంట్లో అందరికీ క*రోనా వచ్చింది అని చెబుతున్నారు. ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే రెండవ దశలో క*రోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది.
బాగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒకరికి రాకున్నా మరొకరికి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే అందరికీ వచ్చిన తర్వాత జాగ్రత్త పడేకంటే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. లేదా ఒకరికి వచ్చిన తర్వాత మిగతా వారికి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని డౌట్ వస్తే ఎలా జాగ్రత్త పడాలి. ఎవరికైనా జ్వరం రాగానే వారు విడిగా ఉంటూ జాగ్రత్తపడాలి. వారి వస్తువులు మిగతావారు ముట్టుకోకుండా ఉండాలి. ఇంతకుముందు 24 గంటల్లో వచ్చేది ఆర్ టి సి పి ఎస్. కానీ ఇప్పుడు జనం ఎక్కువవడంతో ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపించి పరీక్ష సమయం కూడా ఎక్కువ పడుతుంది.
క*రోనా వచ్చిందని అనుమానంతో ఆవిరి పడుతుంటే వారికి దగ్గరలో ఉండరాదు.అలా చేయడం ప్రమాదకరం. వారితో పాటు కూర్చోడం, కాఫీ తాగడం, టీ తాగడం చేయకండి. వారికి అన్ని విడిగా ఇవ్వడం మంచిది. చిన్న గదుల్లో ఉండేవాళ్ళకి త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఒకరికి వచ్చిందని తెలిస్తే మిగతావారు మందులు వేసుకోవలసిన అవసరం లేదు.
దాని వలన లాభం ఉంటుంది అని రుజువు లేదు. మందులు వేసుకోవడం కంటే కూడా కొద్దిపాటి జాగ్రత్తలు క*రోనా బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. విటమిన్ టాబ్లెట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ రెండు రకాలు ఉంటాయి. కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటంటే ఏ, డి, ఈ, కె.
ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ తీసుకున్న ఏం కాదు. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటి వాటర్ సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా తీసుకున్న వాటర్ లో బయటికి వెళ్లిపోతాయి. వాటి వలన పెద్ద ప్రమాదం ఉండదు. ఏవి ఎక్కువగా తీసుకున్నా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాటి వలన వచ్చే రక్షణ ఏం లేదు. క*రోనా సోకకుండా ఉండడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.మాస్క్ ధరించాలి. ఇంట్లో ఒకరికి క*రోనా రాగానే వాళ్లు తప్పకుండా మాస్కు ధరించి ఉండాలి. ఇంట్లో అందరూ మాస్కు ధరించి ఉండడం మంచిది. వాళ్లకి మంచి ఆహారం అందించాలి. ఆక్సిజన్ మరియు పల్స్ రేటు ఎలా ఉంటుందో చూసుకుంటూ ఉండాలి.
వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేక నీరస పడిపోతున్నారా గమనించుకోవాలి. వారిని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవలసి వస్తే ఒకే కారులో వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి ఉండాలి. ఒక రూమ్ లో ఉంచినపుడు వారి మానసిక స్థితి ఎలా ఉందో చూస్తూ ఉండాలి. వాళ్లకి మానసిక ధైర్యం అందించాలి. మేమున్నామని సపోర్ట్ ఇవ్వాలి. అలాగే మనకి రాకుండా జాగ్రత్తలు పడాలి. ఒకరికి క*రోనా వస్తే భయపడకుండా జాగ్రత్త పడుతూ వారికి కోలుకునేందుకు సహకరించాలి. అలాగే మనకి రాకుండా ఉండడానికి జాగ్రత్తపడాలి.