ముళ్ళ గోరింట ఈ పూలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కలను ఇంటి ముందు అందానికి పెంచుకుంటారు. ఆడపిల్లలు పూలు తలలో పెట్టుకుంటారు. ఈ పూలు చాలా అందంగా చలికాలంలో ఎక్కువగా వస్తాయి. ఈ మొక్కలు అందానికే కాకుండా చాలా ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి.ముళ్ల గోరింటలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.
ముళ్ళ గోరింట తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగు పువ్వులను కలిగి ఉంటాయి. గోరింట వేర్లతో పళ్ళు తోమడం వల్ల పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. దీనిని సంస్కృతంలో వజ్రదంతి అంటారు. వజ్ర అంటే వజ్రం అని దంతి అంటే పళ్ళు అని. పళ్ళు వజ్రాలలా మెరిసిపోతాయి అని అర్థం. గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ఆకులను ఫేస్ట్ చేసి పై పూతలా పూసినట్లయితే చర్మ సమస్యలు తగ్గుతాయి. ఆకుల ఫేస్ట్ని ప్రకృతి ప్రసాదించిన పేస్టులాగా వాడొచ్చు. ఆకులను పేస్ట్ చేసి కొంచెం ఉప్పు కలిపి పళ్ళు తోమినట్లయితే దంతాల గార, పసుపుదనం, పాచి పోతాయి.
ఈ ఆకులను డికాషన్ చేసుకొని నోరు పుక్కలించినట్లయితే నోటి దుర్వాసన, మౌత్ అల్సర్ వంటివి తగ్గుతాయి. ఆకులు పేస్ట్ చేసుకొని పళ్ళు తోముకున్నట్లయితే చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. కీళ్ళ వాపులు, అధిక బరువుతో బాధపడే వారు ఈ మొక్కలు బెరడును తీసుకొని బాగా కడిగి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఒళ్ళు నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చెంచా తీసుకోవడం వల్ల ఒళ్ళు నొప్పులు, శరీరంలో అధిక కొవ్వు తగ్గుతాయి.
మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల పేస్టు నొప్పి ఉన్న భాగంలో అప్లై చేస్తే నొప్పి, వాపు వంటివి తగ్గుతాయి. ముళ్ళ గోరింట వేళ్లను పొడిచేసి ఆ పొడి తో పళ్ళను రుద్దినట్లయితే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. ఆకుల రసాన్ని తీసి దానిలో తేనె కలుపుకొని తీసుకోవడం వలన నోటి దుర్వాసన, నోటిపూత వంటివి తగ్గుతాయి.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సరే డికాషన్ ఐతే 50ml నుంచి 200ml వరకు మాత్రమే తీసుకోవాలి. ఆకుల రసమైతే 50ml నుంచి 100ml వరకు మాత్రమే తీసుకోవాలి. మీకు తెలియక పోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకొని తీసుకోవాలి. అంతే తప్ప సొంతంగా తీసుకోకూడదు. ఆయుర్వేద డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటే మంచిది.