multi vitamin plant uses in telugu

ఈ ఒక్క మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలు అన్ని రోగాలు తోకముడుస్తాయ్!!

శరీరానికి విటమిన్స్, ప్రోటీన్స్ ఎంతో అవసరం. ఇవి సమృద్ధిగా శరీరంలో లేకపోతే శరీర సామర్థ్యం సరిగా ఉండక పోషకాహార లోపం వచ్చి శరీర దృఢత్వం కోల్పోయి రోగ నిరోధక వ్యవస్థ నెమ్మదించి తొందరగా అనారోగ్యానికి గురవుతారు. శరీరానికి కావలసిన పోషకాల కోసం మనం వివిధ ఆహారాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కారణం ఒక్కో ఆహారంలో ఒక్కో ప్రోటీన్ లేదా విటమిన్ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం సమకూర్చుకోవడం ఒకోసారి జరగదు. దీనివల్ల ఎదో ఒక ప్రోటీన్ లేదా విటమిన్ లోపం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంటారు. అయితే పోషకాలు అన్ని ఒకే చోట లభిస్తే ఆరోగ్యం మొత్తం సులువుగా మనకు దొరికినట్టే కదా!! అన్ని పోషకాలు ఒకే చోట ఎక్కడ దొరుకుతాయి అని ఎవరూ దిగులు పడక్కర్లేదు. కేవలం ఒక మొక్కను మీ పెరట్లో లేదా చిన్న కుండీలో నాటితే చాలు. ఇంతకు ఆ మొక్క ఏంటి అని కదా మీ అనుమానం. మల్టీవిటమిన్ మొక్కగా పేరొందిన చక్రముని ఆకు మొక్కనే బోలెడు పోషకాల నిలయం.

ఈ మొక్కలో ఉన్న ప్రత్యేకత మరియు ప్రయోజనాలు చూద్దాం మరి. 

◆అధిక  యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లు ఈ మొక్కలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి  గాయం నయం చేయడంలో గొప్పగా సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, మరియు యాంటీబేసిటీ ఏజెంట్‌ గా కూడా ఈ మొక్క పనిచేస్తుంది. అంతేకాదు ప్రసవం తరువాత  తల్లి పాల ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని ఈ మొక్క కలిగి ఉంది. 

◆ ఇందులో ఉన్న విటమిన్స్ తాలూకూ విలువలను మరియు అవి శరీరానికి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనికి మల్టివిటమిన్ అనే పేరు స్థిరపడింది.

◆ ఈ మొక్క  ఆకులు సాంప్రదాయకంగా కొన్ని వ్యాధుల చికిత్సకు, బరువు తగ్గడానికి మరియు వంటలలో ఉపయోగిస్తారు.  ఈ ఆకులలో ఎక్కువ  మొత్తంలో సూక్ష్మపోషకాలను కలిగి ఉండటం వల్ల దీన్ని తీసుకునే వారికి పోషకాహార లోపం అనేది దరిచేరదు. ఈ సూక్ష్మపోషకాలలో ఫినోలిక్ సమ్మేళనాలు, కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ విటమిన్లు మరియు ఖనిజాలు మొదలైనవి ఉంటాయి. 

◆ఈ చక్రముని ఆకులలో సోడియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, ఇనుము,  మెగ్నీషియం, రాగి, జింక్, మాంగనీస్ మరియు కోబాల్ట్‌లతో సహా చాలా ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి.

◆అయితే ఈ ఆకులను తాజాగా తీసుకోవడం వల్ల వీటిలోని  హెవీ మెటల్ విషపూరితమయి ఊపిరితిత్తులకు గాయాన్ని కలిగించి వాటిని ప్రేరేపించడం ద్వారా అనారోగ్యాన్ని కలుస్తాయి. కాబట్టి చక్రముని ఆకును తాజాగా, పచ్చిది తీసుకోవడం అనారోగ్యం చేస్తుంది. 

చివరగా….

 ఈ ఆకులో ఔషధ లక్షణాలు ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి ఆకును ఉడికించి ఫ్రై, లేదా పప్పు, లేదా నచ్చిన విధంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!