మారుతున్న కాలాన్ని బట్టి ఫ్రెష్ గా వెజిటేబుల్స్ ని లేదా ఫ్రెష్ గా ఫ్రూట్స్ ని తినడానికి బదులుగా నెలలు తరబడి నిలువ చేసుకునే విధంగా డ్రై వెజిటేబుల్స్ వాటి పౌడర్స్ ఎక్కువగా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ బదులుగా వాటిని తినలేని వారు పౌడర్ ఫామ్ లో తక్కువ మోతాదులో ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. మామూలుగా వెజిటేబుల్స్ పౌడర్ చేయవలసినప్పుడు టమోటాలు, క్యాప్సికం, కాకరకాయ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి ఈ రకంగా అన్ని వెజిటేబుల్స్ ని పౌడర్ ఫామ్ లో చేసుకోవచ్చు. ఆకుకూరల్లో కూడా మునగాకు పౌడర్, కరివేపాకు పౌడర్, మెంతికూర పౌడర్.
ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. కాబట్టి వీటిని వాడడం వల్ల లాభమే గాని నష్టమేమీ ఉండదు. వీటిని తయారు చేయడానికి రెండు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఖర్చు లేకుండా చేయదలచిన వారు వీటిని కడిగేసి ముక్కలు కట్ చేసి తడి లేకుండా ఎండలో ఆరబెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని పౌడర్ చేస్తారు. ఎండలు ఉన్నప్పుడే ఇలా చేయడానికి కుదురుతుంది. ఎండలు లేనప్పుడు కూడా వీటిని ఆరబెట్టాలి అంటే సోలార్ డ్రయర్స్, కొన్ని ఎలక్ట్రిక్ డ్రైయర్స్ కూడా ఉంటాయి. వీటిని ఉపయోగించి వెజిటేబుల్స్ గాని, ఆకుకూరలు గాని వేసేసి బాగా హీట్ చేస్తారు.
ఆ హీట్ కి ఒకటి రెండు రోజుల్లోనే డ్రై అయిపోతాయి. మెంతికూర కూరలో వేసుకోవడం వల్ల ఉప్పులేని లోటు తెలియదు. మునగాకు పొడి కూడా ఇందులో కలిపిన పుల్కాలో కలిపిన, కూరలలో కలిపిన అందులో ఉండే లైట్గా చేదు ఉప్పులేని లోటును భర్తీ చేస్తుంది. ఇలా క్యారెట్ కూడా బీట్రూట్ పొడి, టమాట పొడులు వండేటప్పుడు వేస్తే గ్రేవీగా ఉంటుంది. ఉప్పులేని లోటు భర్తీ చేస్తుంది.ఈ పొడులను ప్రైస్ లో చల్లుకోవడం కంటే తక్కువలో ఎక్కువ మొత్తంలో పొడి వెళ్ళిపోతుంది. ఎక్కువ పోషకాలు లభిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉండడానికి, బాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.
ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని 2013లో ఏంబడ్డిన్ యూనివర్సిటీ ఆఫ్ USA వారు స్పెషల్ గా దీని మీద చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వీటి వల్ల లాభాలే ఉన్నాయి కానీ ఏ విధమైన హాని లేదు.