mushroom benefits for health

వీటిని తింటూ ఉంటే వృద్ధాప్యం మీ దగ్గరకు రావాలంటే భయపడాల్సిందే!!

అందరికి తెలిసిన పుట్టగొడుగులలో అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఒకటి ఉంది. వృద్ధాప్యాన్ని దూరం చేసుకోవాలన్నా, ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉండాలన్నా కనీసం వారానికి ఒకటి రెండు సార్లయినా పుట్టగొడుగులు తింటే కుర్రకారులా హుషారుగా ఉండొచ్చు. కేవలం ఇదొక్కటే కాదు  ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న ఈ విషయం చాలా మందికి తెలియదు. 

◆పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి, యవ్వనానికి  ప్రధాన కారణం. ఉడికించినప్పటికీ వీటిలో యాంటీ ఆక్సీడెంట్ల శాతం తగ్గదు.

◆మనం ఆహారం తీసుకున్నప్పుడు అది ఆక్సీకరణకు గురైనప్పుడు శరీరానికి హాని కలిగించే  ఫ్రీరాడికల్స్ శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు కలుగజేస్తాయి.. మనిషి శరీరంలో అనువంశిక కారకమైన డిఎన్ ఏ పై ప్రభావం చూపించి తొందరగా ముసలితనాన్ని వచ్చేట్టు చేస్తాయి. అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ విడుదలను అడ్డుకుంటాయి.

◆వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో బలవర్థక విటమిన్లకు కొరతే లేదు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో లభ్యమయ్యే విటిక్మిన్-డి చర్మంపై మొటిమలు, ఎలర్జీలు,ఇతర చర్మ సంబంధ సమస్యలను దరిచేరకుండా కాపాడుతుంది. . ప్రముఖ వాణిజ్య సౌందర్య ఉత్పత్తులన్ తయారీలో ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు కలుపుతారు.

◆పుట్టగొడుగుల్లో బి1, బి2, బి3, బి5, బి9లు విటమిన్స్ ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్‌ వంటి సమస్యల  నివారణలో శక్తివంతంగా పనిచేస్తుంది ఇవి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి.

◆పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను, కాలుష్యం వల్ల తలెత్తే ముడతలను కూడా ఇవి నివారిస్తాయి. . వీటిల్లో కొలెస్ట్రాల్‌, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్‌ ప్రమాణాన్ని తగ్గిస్తాయి. రక్తహీనతను అరికడతాయి.

◆కాన్సర్లను అరికట్టడంలో ముఖ్యంగా రొమ్ము, ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు గొప్ప ఆహారంగా పనిచేస్తాయి. . పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్‌ తలెత్తదు. రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

◆పొటాషియం ఎక్కువ ఉండడంవల్ల రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందడంలో దోహదపడుతుంది. . ఐరన్‌  కూడ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో ఇవి పనిచేస్తాయి. గుండె ఆరోగ్యంగా పని చేయడానికి సహకరిస్తాయి.

చివరగా…..

నిజంగానే వీటిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది కదూ. కానీ నిజమే, వీటిని తినే వారు ఇంకాస్త ఎక్కువ తినండి… అసలు తినని వారు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. వృద్ధాప్యాన్ని చెంత చేరనివ్వకుండా ఆరోగ్యాన్ని అందాన్ని యవ్వనాన్ని సొంతం చేసుకోండి.

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!