దేవుడు ఉన్నాడని నమ్మినట్టే దెయ్యాన్ని కూడా నమ్మాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. చిన్న పిల్లలకి దిష్టి తగిలిందని అంటుంటారు. అంటే చాలా మంది చిన్న పిల్లలను చూసి అసూయ లేదా ఈర్ష్యతో ఉన్నప్పుడు పిల్లలకు అనారోగ్యం చేయడం, ఏడవడం, ఇబ్బంది పడటం వంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన పెద్ద వాళ్ళు అనేక రకాల చిట్కాలు చేసి వారిని మామూలు చేస్తుంటారు. అలాగే పెద్ద వారికి కూడా ఇలాంటి దిష్టీ తగలడం ఉంటుందా అంటే ఉంటుందనే చెబుతున్నారు. మనం చాలాసార్లు ఏదైనా ఫంక్షన్ కి లేదా పార్టీలకు వెళ్లి వచ్చిన తర్వాత తల నొప్పిగా అనిపించడం, నీరసంగా ఉండడం వంటివి అనిపిస్తూ ఉంటుంది అంటే దిష్టి తగిలిందని అర్థం.
మనం ఎక్కువగా మనుషులకు మనుషులతో కలుస్తున్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. దృష్టి అంటే ఏమిటో కాదు ఎదుటివారు మన పట్ల నెగిటివ్గా ఫీల్ అవ్వడం వలన ఆ ఎనర్జీ మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అలా దృష్టి తగిలినప్పుడు పెద్దవారికి కూడా దిష్టి తీస్తుంటారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాక్కోవడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు ఉప్పు, ఆవాలు వంటివాటితో దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే పెద్దలకు కూడా మన ఇంట్లో ఉన్న ఏదైనా ఉప్పును ముఖ్యంగా గుప్పిట నిండా తీసుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి. తర్వాత ఎవరూ తొక్కని చోట వేయడం వలన దృష్టి నుండి బయటపడవచ్చు.
అలాగే ఇంట్లో పెద్దవారికి అనారోగ్యం చేసినప్పుడు ఒక గాజు గ్లాసు నీటిని తీసుకొని అందులో ఒక గుప్పెడు ఉప్పును వేసి పెద్దవారు తల దగ్గర పెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని బయట లేదా సింకులో పారేయవచ్చు. అలాగే ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వంటి శుభకార్యాలకు ఇంటికి చాలా మంది వస్తుంటారు. అలాంటి వారు మనసులో ఎటువంటి చెడు దృష్టి తో ఉన్నారో మనకు తెలియదు. అలాంటి వారి దిష్టి మన ఇంటిపై పడకుండా ఉండడానికి ఒక గిన్నె తీసుకొని అందులో మిరియాలు వేసి ఉప్పు తో కవర్ చేయాలి. దీనిని ఇంట్లో ఏదైనా మూల ఎవరు కంటపడకుండా పెట్టాలి. మరుసటి రోజు ఉప్పును పారే నదిలో కానీ నీటిలో కానీ వేసేయవచ్చు. ఇలా మీకు దిష్టి తగిలింది అని అనిపించినప్పుడు ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.