Natural anti aging home remedies

పది రూపాయలతో ఎందుకు పనికి రావు అనుకునే గింజలు, పాలతో తీసుకుంటే 100సంవత్సరాలు వెనక్కి వెళ్తారు

ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల వలన బెల్లీ ఫాట్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ చిట్కా ఉపయోగించి బెల్లీ ఫాట్  తగ్గించుకోవచ్చు. సోంపు ఇవి అందరికి తెలిసే ఉంటాయి. వీటిని ఉపయోగించి అనేక రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. సోంపు శరీరంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సోంపు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం లేవగానే ఆ నీటిని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి 5 నుండి పది నిముషాల పాటు మరగనివ్వాలి.

        తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని వడకట్టుకుని వేడిగా ఉన్నపుడే టీ తాగినట్లుగా తాగాలి. ఇలా వరుసగా 15 రోజుల పాటు తాగినట్లయితే బెల్లీ ఫాట్, అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ నీళ్లు తాగిన టీ, కాఫీలు ఏమి తాగకూడదు. ఈ డ్రింక్ తాగడం వలన చర్మ రంగు మెరుగుపడుతుంది.  రోజుకి ఒక చెంచా సోంపు తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. సోంపు మరియు ధనియాలు కొంచెం వేయించుకుని పటిక బెల్లంతో ఈ రెండిటిని సమాన మోతాదులో కలిపి ఒక చెంచా తీసుకుని నమిలి మింగేసి గోరు వెచ్చటి నీళ్లు తాగినట్లయితే కాళ్ళు, చేతులు దురదలు, గొంతులో కీచు కీచు శబ్దాలు తగ్గుతాయి.

       సైట్ ఉన్నవారు ఒక చెంచా సోంపు, ఒక చెంచా పటిక బెల్లం కలిపి నమిలి తినేసి ఒక గ్లాసు పాలు తాగినట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది. రక్త హీనతతో బాధపడేవారు సోంపు తినడం వల్ల బ్లడ్ పడుతుంది.సోంపు, ధనియాలు, పటిక బెల్లం కలిపి పొడి చేసి మీగడ తీసిన పాలలో ఒక చెంచా కలుపుకుని తాగడం వలన అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గుతారు.ధనియాలు, సోంపు కలిపి ఒక చెంచా, పటిక బెల్లం ఒక చెంచా పాలు మరిగేటపుడు వేసి మరిగించుకుని ఆ పాలను వేడి వేడిగా తాగినట్లయితే  నిద్ర లేమి సమస్యతో బాధపడేవారికి బాగా నిద్రపడుతుంది. 

        కొంతమందికి బాడీ వేడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నవారు గోరువెచ్చటి పాలు తాగాలి లేదు మామూలుగా ఉంది అనుకున్నవారు వేడి వేడిగా తాగాలి.  సోంపు తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్, ఎసిడిటీ,అజీర్తి  వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది.  సోంపు ఉపయోగించడం వలన అధిక బరువు సమస్యను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!