మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి వల్ల తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నారు. అతి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావడం వల్ల నలుగురిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం వాటిని దాచి పెట్టడం కోసం రకరకాల హెయిర్ కలర్ ను ఉపయోగిస్తారు.
కానీ మార్కెట్లో దొరికే హెయిర్ కలర్ చాలా రకాల కెమికల్స్ ను కలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా హాని కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. ఒకసారి అప్లై చేసినట్లయితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో తీసుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని దానిలో రెండు చెంచాల టీ పొడి వేసి బాగా మరగనివ్వాలి. డికాషన్ బాగా మరగనివ్వాలి. తర్వాత 10 లవంగ మొగ్గలు వేసి బాగా మరిగించుకోవాలి. ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చెంచా కాఫీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత రెండు బీట్రూట్ లను తీసుకుని తొక్క చెక్కి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి నీళ్లు వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం నుండి జ్యూస్ ను వడకట్టుకోవాలి. తర్వాత ఒక ఇనుప కడాయి తీసుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న డికాషన్ వేసుకోవాలి. తర్వాత దానిలో బీట్రూట్ జ్యూస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మార్కెట్లో కేస రంజని పౌడర్ చాలా విరివిగా లభిస్తుంది. ఇది అన్ని రకాల ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. మనం ముందుగా కలుపుకున్న డికాషన్, బీట్రూట్ జ్యూస్ లో ఈ పౌడర్ ను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా బాగా టైట్ గా కాకుండా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేవిధంగా కలిపి రాత్రంతా మూత పెట్టుకోవాలి.
ఈ ప్రొసీజర్ మొత్తం ఇనుప కడాయిలో మాత్రమే చేసుకోవాలి. ఇనుప కడాయిలో చేసినట్లయితేనే రిసల్ట్ బాగుంటుంది. ఉదయం మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది నల్లగా మారిపోయి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసిన తర్వాత జుట్టుని బాగా దువ్వుకొని చిక్కులు లేకుండా ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత గంట నుండి రెండు గంటల వరకు ఉండనివ్వాలి. తర్వాత షాంపూ యూజ్ చేయకుండా కేవలం నీటితో మాత్రమే వాష్ చేసుకోవాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయడం వల్ల తెల్ల వెంట్రుకల మొత్తం పోయి జుట్టు నల్లగా మారిపోతుంది.