Natural Face Wash For Spotless Glowing Skin

మీ ముఖం మీద మచ్చలు మొటిమలు పోయి మొఖం గ్లోగా మెరవాలంటే ఈ ఫేస్వాష్ ట్రై చేయండి

ఫేస్ వాష్ కోసం మన చర్మ రకాన్ని బట్టి రకరకాల ఫేస్ వాష్లను ఉపయోగిస్తుంటాం. కానీ ఇవన్నీ కెమికల్స్ తో తయారైనవి కనుక వీటివలన ప్రస్తుతానికి ప్రయోజనం ఉన్నా దీర్ఘకాలంలో చర్మం డ్యామేజ్ అవుతుంది. దీనిని అరికట్టి ముఖానికి మంచి గ్లో అందించడానికి మనం సహజమైన పదార్థాలతో మంచి ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు.

 దాని కోసం మనం మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. దీని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ పేస్ట్ ను వడకట్టి రసాన్ని వేరు చేసుకోవాలి. ఈ రసంలో  మన ముఖానికి ఎన్నో ప్రయోజనాలందించే సూపర్ పదార్థం యాడ్ చేస్తున్నాం. అదే సెనగపిండి. సెనగపిండి చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది. ముఖంపై మచ్చలు , మొటిమలు తగ్గిస్తుంది.  మీకు శెనగపిండి పడకపోతే గోధుమపిండి వరిపిండి వేసుకోవచ్చు.

 తర్వాత ఒక అర చెక్క నిమ్మరసం పిండాలి. నిమ్మరసం ముఖంపై ఉండే మృతకణాలను తొలగించి ముఖం మంచి రంగులోకి వచ్చేందుకు సహకరిస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక గిన్నెలో నీరు పెట్టుకొని ఈ కలిపి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో దానిపై వేడిచేయాలి. 

అంటే ఆ నీటిలో ఈ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన వేడికి మిశ్రమం ఉండలు కట్టకుండా దగ్గరవుతుంది. ఇది పేస్ట్లా తయారైన తరువాత నీటిలోనుంచి తీసి  చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒక స్పూన్ తీసుకోవాలి. మీరు నురగ రావాలి అనుకుంటే ఒక స్పూన్ మీరు వాడే ఏదైనా  ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేదా ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఒక పదినిమిషాల పాటు వదిలేయాలి. 

తర్వాత కొద్దిగా నీటిని అప్లై చేసి మసాజ్ చేస్తూ రిమూవ్ చేయడం వల్ల ఇది ముఖంపై ఉండే జిడ్డు, మురికి తొలగించి ముఖాన్ని తాజాగా తయారు చేస్తుంది  ఈ పేస్ట్ ను కావాలంటే ఐస్ క్యూబ్ కింద మార్చుకుని రోజు ఒక ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు.లేదా ఫ్రిజ్ లో ఎయిర్ టైట్ బాక్స్లో పేస్ట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ముఖాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు ఓపెన్ ఫోర్ సమస్యలను కూడా నివారిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!