ప్రస్తుతం రోజులలో ఉన్న ఆహార అలవాట్లు వాతావరణ పరిస్థితులు అనారోగ్య సమస్యల వలన ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అతి చిన్న వయస్సు ఉన్న వారికి కూడా తెల్ల వెంట్రుకలు రావడం సర్వసాధారణం అయిపోయింది. తెల్ల వెంట్రుకలను నల్లగా చేసుకోవడం కోసం రకరకాల మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ ఉపయోగించడం వలన జుట్టుకు హాని కలిగిస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు.
దీనికోసం గుంటకలవరాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గుంటకలవరాకు చేతితో నలిపితేనే చేయి నల్లగా అవుతుంది. అంటే ఇలాంటి ఆకు జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. గుంటకలవరాకు ఉపయోగించి ఈ నూనెను తయారు చేసుకొని వారంలో మూడు సార్లు ఉపయోగించడం వల్ల తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు నల్లగా మారుతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం ముందుగా గుంటకలవరాకు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
పక్కన పెట్టుకున్న గుంటకలవరాకు స్టవ్ మీద కడాయి పెట్టుకొని గుంటకలవరాకు వేసుకొని తడిలేకుండా ఒకసారి వేయించుకోవాలి. తడి మొత్తం ఇంకిపోయిన తరువాత దానిలో 200ml కొబ్బరి నూనె వేసి మరిగించుకోవాలి. నూనెలోని ఆకులు మొత్తం నల్లగా ఎంత వరకు నూనె మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లార్చుకోవాలి. చల్లారిన నూనెను వడ కట్టుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె వారంలో మూడుసార్లు అంటే రోజు విడిచి రోజు తలకు అప్లై చేసుకోవాలి.
నూనె అప్లై చేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు బలంగా తయారవుతుంది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు మొత్తం నల్లగా మారుతుంది. ఎటువంటి హెయిర్ అవసరం లేకుండా న్యాచురల్ గా మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆడవారు, మగవారు కూడా ఉపయోగించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నూనెను ఉపయోగించుకోవచ్చు. 6, 7 రకాల పదార్థాలు కలిపి ఉపయోగించి తయారు చేసిన నూనె కంటే ఈ ఒక్క ఆకు వేసి తయారు చేసిన నూనె ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.