Natural Home Remedies For Diabetes

షుగర్ లైఫ్ లో రావద్దు అన్నా….. వచ్చిన షుగర్ కంట్రోల్ లో ఉండాలి అన్నా ఇవి తింటే చాలు……. అంతా పవర్ఫుల్…

షుగర్ వ్యాధి బాగా కంట్రోల్ లోకి రావాలి అంటే అన్నం మానేసి పుల్కాలు తింటే చాలా మంచిదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి వారసత్వంగా ఫ్యామిలీలో షుగర్ ఉన్నప్పుడు వారికి షుగర్ రాకుండా ఉండడానికి కూడా ముందు నుంచే రైస్ మానేసి పుల్కాలు తింటే మంచిదని చెబుతారు. అటువంటి పుల్కాలను గోధుమపిండితో చేసుకుంటూ ఉంటాం. గోధుమ పిండిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు మామూలు గోధుమలు పుల్కాలు చేసుకుంటే కంటే కూడా నల్ల గోధుమలతో పుల్కాలు చేసుకుంటే మంచిది.

                          ఇవి మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. వీటిని కనుక పిండి పట్టించి వీటితో పుల్కాలు చేసుకుంటే డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఫలితాలు అందిస్తుంది అని, లేనివారికి రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మామూలు గోధుమలు కంటే స్పెషల్ గా నల్ల గోధుమలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. వీటిని తీసుకుంటే 30% గ్లూకోజ్ రక్తంలో అబ్జర్వేషన్ తగ్గింది అని సైంటిఫిక్ గా 2018 సంవత్సరంలో పాకీక్ యూనియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పీజీ చైనా వారు నిరూపించారు.

                           120 మంది మీద ఈ పరిశోధన చేశారు అందులో 60 మంది పై సాధారణ గోధుమలతో తయారుచేసిన పుల్కాలు ఇచ్చి మిగిలిన 60 మందికి నల్ల గోధుమలతో చేసిన పుల్కాలు ఇచ్చారు. ఎవరైతే నల్ల గోధుమలతో చేసిన పుల్కాలు తిన్నారా వారికి 30% గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయింది. అలాగే బీటా సెల్స్ యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని కాస్త పెంచడానికి కూడా  సహాయపడుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి కూడా నల్ల గోధుమలు ఉపయోగపడుతున్నాయని వీళ్ళ పరిశోధనలు తేలింది.

                         ఇంకా కొంతమందికి 30% కంటే ఎక్కువ బ్లడ్ గ్లూకోస్ కంట్రోల్ లోకి రావాలి అంటే ఈ నల్ల గోధుమల పుల్కాలు చేసుకునేటప్పుడు వాటిలో మెంతికూర వేసి చేసుకోండి. ఎప్పుడైనా మీకు లభించినప్పుడు మునగాకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో కాస్త రుచికరంగా ఉండడానికి కొంచెం నువ్వులు కూడా కలుపుకోవచ్చు. వీటివలన నల్ల గోధుమలు పుల్కాలు టెస్ట్ చాలా బాగుంటాయి. మునగాకు, మెంతికూర వేయడం వలన మంచి రుచిగా ఉంటాయి. మరియు పిండి మోతాదు కూడా కొంచెం తగ్గుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఇంకా కొంచెం ఎక్కువ కంట్రోల్ లో ఉంటాయి. కనుక ఆన్ కంట్రోల్ డయాబెటిస్ ఉన్నవారు నల్ల గోధుమల పుల్కాలు తినడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది…

Leave a Comment

error: Content is protected !!