Natural ingredients for hair growth and thickness

టాప్ సీక్రెట్ ప్యాక్ రెండుసార్లు వాడితే చాలు జుట్టు దట్టంగా పెరుగుతుంది

 ఈ మధ్యకాలంలో  వాతావరణ పరిస్థితులు,  ఆహారపు అలవాట్లు వలన జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. చిన్న వయసు వారి నుండి పెద్ద వారి వరకు  ప్రతి ఒక్కరు ఈ  సమస్యతో  ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను  తగ్గించుకోవడం కోసం హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. కానీ  వాటిలో ఉండే కెమికల్స్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ పద్ధతిలో జుట్టు రాలడం తగ్గించుకొని జుట్టు  ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. 

      దీనికోసం ముందుగా మనం మునగాకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. మునగాకులు   జుట్టు పొడవును బట్టి తీసుకోవాలి. తర్వాత దీనిలో అర గ్లాసు మజ్జిగ లేదా పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా స్ట్రైనర్  సహాయంతో వడకట్టుకొని జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఇలా పేస్ట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే తల స్నానం చేసిన తర్వాత ఈ పిప్పి జుట్టులో  ఇరుక్కుపోవడం వలన ఇబ్బందిగా ఉంటుంది. జ్యూస్గా తీసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు. 

       తర్వాత ఒక బౌల్ తీసుకొని బ్రింగ్ రాజ్ పౌడర్ ను మూడు చెంచాలు వేసుకోవాలి. పల్లెటూర్లలో ఉన్నవారికి వారికిగుంటకలవరాకు  దొరికితే డైరెక్ట్ గా ఆకుల  పేస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు బ్రిన్గ్రాజ్ పౌడర్ లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెరుగు మునగాకు రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక ఎగ్ వైట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదర నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో  తలుస్తానం చేయాలి. 

        ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల  తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి. తెల్ల వెంట్రుకలు రావడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.  పెరుగు ఉపయోగించడం వలన జుట్టు శనిగా మారుతుంది. మునగాకు లో ఉండే విటమిన్స్, ఏంటి ఆక్సిడెంట్స్ జుట్టు రాలడమే కాకుండా పేనుకొరుకుడు, సోరియాసిస్, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ అంటే సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. బ్రింగ్రాజ్ జుట్టుకుదుల నుండి బలంగా చేసి  తెల్ల వెంట్రుకలు రాకుండా వచ్చిన వెంట్రుకలు నల్లగా చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. 

       ఎగ్ వైట్ జుట్టుకు కావలసిన ప్రోటీన్స్ అందించడంలో సహాయపడుతుంది. రెండుసార్లు ఉపయోగించినట్లైతే మీ జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!