natural-mouth-care-home-remedies-in-telugu

నోటి సంరక్షణ కు చక్కటి గృహ చిట్కాలు మీకోసం..

మీ చిగుళ్ళు, పళ్ళు మరియు నోరు ఈ మూడు అంశాలలో తీసుకునే సంరక్షణా చర్యల ఫలితంగా, మీ నోటి పరిశుభ్రత మరియు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దంత క్షయం, గమ్ వ్యాధి, చెడు శ్వాస మొదలైనవి  ప్రధానమైన ఆరోగ్య సమస్యలు.మీరు, గత కొన్నేళ్ళుగా నోటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? నోటిలో తరుచూ పూత,పళ్ళు పుచ్చడం వస్తున్నాయా?అయితే, మీ సమస్యల పరిష్కారానికి ఈ చిట్కాలు తెలుసుకోండి.

నోటి పూత లేదా నోటి మీద పుండ్లు

త్రిఫల చూర్ణం

ప్రతిరోజు రాత్రి పడుకునేముందు అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని, ఒక కప్పు వేడి నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లబిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కలబంద గుజ్జును(అలో విరా) తీసుకుని నోటి పూత లేదా పుండ్లు పైన పూతలా రాసుకోవాలి. క్రమం తప్పకుండా రాసుకుంటే, ఉత్తమ ఫలితాల మూడు నుండి ఐదు రోజులలో పొందుతారు. త్రిపల కడుపు లోపనుంచి ఉపశమనం కలిగిస్తే ,కలబంద గుజ్జు మూలముగా పుండుకు చలవ చేసి అతి తక్కువ కాలంలోనే పుండ్లు తగ్గుముఖం పడతాయి.

కావిటీస్ లేదా పళ్ళు పుచ్చడం

యాలకులు

కావిటీలు లేదా పళ్ళు పుచ్చడం వంటి సమస్యలకు యాలకులని అద్భుతమైన మూలికగా పరిగణించారు.యాలకులని సుగంధద్రవ్యంగానే కాకుండా నోటి పరిశుభ్రతను పెంపొందించే ఔషదంగా కూడా వాడతారు. ప్రతిరోజు ఒక స్పూన్ యాలకులపొడిని కలుపుకొని ఓట్మీల్ ద్వారా తీసుకోవడం,లేదంటే యాలకుల టీ తాగడం మూలంగా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:

నోటిని పరి శుభ్రంగా ఉంచుకోండి… ఆరోగ్యాన్ని , ఆనందాన్ని,మరియు అందాన్ని,  మీ సొంత చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!