Natural Pain Killer Get Relief from all Pains Fix your Back Pain

లంబాగో అంటారు దీన్ని. వందమందిలో తొంభై మందికి ఉంది ఈ సమస్య

లంబాగో అంటే వెన్ను కింది భాగంలో విపరీతమైన నొప్పి కలగడాన్ని లంబాగో అంటారు. దిగువ వెన్నునొప్పి మితిమీరిన పని చేయడం లేదా ఎక్కువగా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం మరియు పడుకోవడం, అసౌకర్య స్థితిలో పడుకోవడం, సరిగ్గా సరిపోని బ్యాక్‌ప్యాక్ ధరించడం వలన వస్తాయి. చాలామంది  కంప్యూటర్ ముందు కూర్చునే వారు అదేపనిగా చైర్లో కూర్చుని ఉంటారు. అలా కూర్చోవడం వలన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పిలో రెండు రకాలు ఉంటాయి. అందులో తాత్కాలికంగా ఐదు లేదా ఆరు వారాలపాటు వచ్చే నొప్పిని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు.

 దీనికి ముఖ్య కారణం కండరాలు పట్టేయడం. ఇది ఎక్కువగా మెట్లు ఎక్కుతున్నప్పుడు, పిల్లల్ని సరైన పొజిషన్లో ఎత్తుకోన్నప్పుడు, సరైన పద్ధతిలో పడుకోన్నప్పుడు ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చికిత్స ద్వారా కొన్ని వారాల్లో తగ్గిపోతుంది  కానీ ఇలా తగ్గనప్పుడు అది లంబాగో ఏమో అని అనుమానించాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ల పరీక్ష ద్వారా నిర్ధారించబడుతుంది. అలాగే ఇది తగ్గి మళ్లీ జీవితంలో రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నడుము కింది భాగంలో, దాని చుట్టు పక్కల ఏదైనా ఇబ్బంది నరాలు పట్టేయడం వంటివి అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

 దీనికి ముఖ్యంగా వేడి నీళ్ల కాపడం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. దానితో పాటు కొన్ని అప్లై చేసి మసాజ్ చేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. దానికోసం నువ్వుల నూనె తీసుకోవాలి. దానిలో ఎప్సం సాల్ట్ వేసి ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ రాసి కాపడం పెట్టడం వలన నొప్పి తగ్గుతుంది  తర్వాత టిప్ కోసం ఆవనూనెలో ముద్ద కర్పూరం కలిపి అది అప్లై చేసినా నొప్పి తగ్గుతుంది. తరువాత చిట్కా పుదీనా పువ్వు, వాము పువ్వు, ముద్ద కర్పూరం కలిపితే ద్రవంలా  తయారయ్యాక నొప్పి ఉన్నచోట అప్లై చేసి కాపడం పెట్టాలి. అలా కాపడం పెట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

 20 నిమిషాల వేడి నీటి కాపడం తర్వాత 20 నిమిషాల ఐస్తో కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి త్వరగా తగ్గుతుంది. వీటితో పాటు పని చేసేటప్పుడు మధ్య మధ్య విశ్రాంతి ఇస్తూ నడవడం వంటివి చేస్తూ ఉండాలి. నొప్పితో బాధపడుతున్న వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే నొప్పి జీవితంలో రాకూడదు అనుకున్నప్పుడు యోగాలో నడుము కింది భాగాన్ని కదిపేందుకు ఆసనాలు చాలా ఉంటాయి. వాటిని చేయడం ద్వారా నొప్పి రాకుండా తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!