ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకల మధ్యలో జిగురు అరిగిపోవడం, నడుస్తున్నప్పుడు టక్ టక్ మని శబ్దం రావడం వంటి సమస్యలు వస్తాయి. ఎముకల మధ్యలో వాతం పెరిగిపోవడం వలన కూడా వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అన్నిటినీ తగ్గించుకోవడానికి కొన్ని రకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ మందులను ఉపయోగించడం వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ మన ఇంట్లో ఉండే వాటితో ఈ చిట్కా ట్రై చేసినట్లయితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీనికోసం 50 గ్రాములు తీసుకోవాలి. సొంటి శరీరంలో వాతం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక యాభై గ్రాముల మెంతులను కూడా తీసుకోవాలి. మెంతులు కూడా వాతం తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఈ రెండు వాతం తగ్గించడమే కాకుండా ఊపిరితిత్తులలో ఉండే కఫాన్ని కూడా తగ్గిస్తాయి.
50 గ్రాముల వాము తీసుకోవాలి. వాము శరీరంలో వాతాన్ని తగ్గించడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాని ద్వారా వాయువులు చాలా తక్కువగా ఉండి జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటి అన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో ఒక చెంచా పౌడర్ కలిపి,ఒక చెంచా బెల్లం కూడా వేసుకుని తాగాలి.
డయాబెటిస్ ఉన్నవాళ్లు అయితే బెల్లం వేసుకోకూడదు. బెల్లం వాతం మరియు కఫాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇలా వరుసగా ఒక 15 రోజుల పాటు తాగినట్లయితే వాత, కఫ, పిత్త దోషాలు తగ్గుతాయి. ఎముకల మధ్య గుజ్జు పెరుగుతుంది. నడుస్తున్నప్పుడు తత్వం శబ్దాలు రావడం కీళ్ల నొప్పులు వెన్ను నొప్పి ఛాతిలో నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపిస్తాయి.
బెల్లం కలిపి వాడటం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. అలాగే మంచి ఎనర్జీ ఇవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. బెల్లం కలపడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది.