చాలామంది పైల్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. పైల్స్ వ్యాధి ఉండటం వల్ల కూర్చోలేరు నిలబడలేరు చాలా ఇబ్బంది పడతారు. పైల్స్ వ్యాధి తొమ్మిది రకాలు ఉంటాయి. పైల్స్ వ్యాధి కొంతమందికి ఎన్ని మందులు వాడినా తగ్గదు. పైల్స్ వ్యాధితో బాధపడేవారు వాష్రూంలో ఉండలేరు బయటకి రాలేరు. ఈ బాధని ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదన అనుభవిస్తారు.
అలాంటి పైల్స్ వ్యాధిని ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం ఒక అరటిపండు తీసుకోవాలి. అరటిపండు బాగా పచ్చిగా లేకుండా, బాగా పండినది కాకుండా మీడియంగా ఉండేది తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చ కర్పూరం ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటిపండు ముక్కలో పెట్టుకోవాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినేయాలి.
తిన్న అరగంట వరకు ఏమి తాగకూడదు, తినకూడదు. అలా తినలేము అనుకున్న వాళ్ళు పచ్చ కర్పూరం పొడి చేసుకుని అరటిపండు ముక్కలపై జల్లుకుని తినేయాలి. అరటిపండు మొత్తం తినేయొచ్చు. ఇది రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. ఇలా వరుసగా మూడు రోజులు తీసుకున్నట్లయితే పైల్స్ వ్యాధి తగ్గుతుంది. పైల్స్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారు 5 రోజులు తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నా పైల్స్ వ్యాధి ఈ చిట్కాతో ఈజీగా తగ్గిపోతుంది.
ఈ చిట్కా ట్రై చేసినపుడు బయట ఆహార పదార్ధాలు తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. కూరలలో కూడా నూనె చాలా తక్కువగా వేసుకోవాలి. కారం కూడా చాలా తక్కువగా తినాలి. కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన పైల్స్ వ్యాధి తగ్గదు. పైల్స్ వ్యాధి పూర్తిగా తగ్గేంతవరకు కారం, మసాలాలు తినడం మానేయాలి. పైల్స్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తినొచ్చు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి, రకరకాల మందులు వాడి విసిగిపోయి ఉంటారు. ఎంత ఖర్చు పెట్టిన తగ్గకపోయి ఉంటే ఒకసారి ఈ ఈజీ చిట్కా ట్రై చేసి చూడండి.
తక్కువ ఖర్చుతో, ఈజీగా ఇంట్లోనే ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న పైల్స్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. పైల్స్ వ్యాధి ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత త్వరగా నయం అవుతుంది. నీళ్లు తాగడం మీద పైల్స్ వ్యాధి తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఈ చిట్కా పాటిస్తూ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పైల్స్ వ్యాధి తగ్గుతుంది.