మగువ శరీరంలో ప్రతిదీ ఒక కళాత్మకత నింపుకున్నదే. ముఖాన్ని చంద్ర బింబం తో పోల్చినా, ముక్కును సంపెంగ తో పోల్చినా, కళ్ళను చేపతో ఉపమానం చేసినా పెదాలను గులాబీ రేకులతో జత చేసినా అన్ని కూడా అద్దం లా మెరిసే చందమామ లాంటి ముఖాన్ని మన ముందు సాక్షాత్కరించేదే. అయితే చాలా మందిలో ఇబ్బంది పెట్టేవి పెదవులు. చాలా సున్నితమైన చర్మపు పొరను కలిగి ఉండే పెదవులు పొడిబారడం, నల్లగా తయారవడం వల్ల ముఖంలో అందం కాసింత తగ్గిపోతుందని చెప్పవచ్చు. అయితే పెదాలను గులాబీ రేకుల్లా మార్చేసే టిప్స్ మీకోసం చూడండి మరి.
◆ బాదం నూనె, తేనె మరియు ఒక టీస్పూన్ చక్కెర మిశ్రమంతో పెదవి చర్మాన్ని స్క్రబ్ చేయండి. మీ పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉన్నందున మెల్లిగా రుద్దాలి. బాదం నూనె మరియు తేనె చక్కెర మృత చర్మాన్ని తొలగించి పెదాలకు తేమను ఇస్తుంది. ఈ స్క్రబ్ యొక్క తరచుగా వాడుతూ ఉంటే గులాబీ రంగు పెదాలను పొందవచ్చు
◆ రుమాలు లేదా టూత్ బ్రష్ తడి చేసి, సున్నితమైన కదలికలలో మీ పెదాలను రుద్దాలి. ఇది చనిపోయిన చర్మపు బయటి పొరను తొలగిస్తుంది, అదే సమయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రాత్రి సమయంలో, మృదువైన గులాబీ పెదాలకు కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెను రాయాలి.
◆ మీ పెదవులను గులాబీ రంగులో ఉండేలా చూసుకోవటానికి ముఖ్యమైనది పెదవులు తేమగా ఉండాలి. పొడిబారిన పెదాలు కళావిహీనంగా ఉంటాయి. తాజా కలబంద మొక్క నుండి కలబంద గుజ్జును సేకరించుకుని ప్రతిరోజు పెదాలకు రాయడం వల్ల పెదవులు తేమగా మృదువుగా తాయరావుతాయి.
◆ ఎక్కువ నీరు త్రాగటం వల్ల పొడిబారిన మరియు పగిలిన చర్మం రాకుండా ఉంటుంది. ఇది పెదాలను తేమగా కనబడేలా చేస్తుంది, పెదవుల రంగును మెరుగుపరుస్తుంది.
◆ విటమిన్ ఇ టాబ్లెట్ కూడా గొప్పగా పనిచేస్తుంది. వితమిన్ ఇ టాబ్లెట్ తీసుకొని అందులో ఉన్న విటమిన్ ఆయిల్ ను అప్లై చేయాలి.. చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో, ప్రసరణను పెంచడంలో మరియు గీతలను నివారించడంలో ఇది సమర్థవంతంగా పమిచేస్తుంది
◆మీరు సహజంగా పింక్ పెదాలను కోరుకుంటే రసాయనంతో నిండిన లిప్‌స్టిక్‌లను వీడండి. మీరు దానిమ్మ, బీట్రూట్ ల రసాన్ని ఉపయోగించి నేచురల్ గా తయారుచేసుకుని వాడాలి. వీటి రసాన్ని లేదవుల మీద వేసి మర్దనా చేస్తుంటే పెదవులు పొడిబారడం అనే సమస్య కూడా ఉండదు.
◆ మీరు లిప్‌స్టిక్‌ను వేసుకునే ముందు, బాదం లేదా కొబ్బరి నూనెతో మీ పెదాలకు రాసుకోవడం మంచిది. కొన్ని నిమిషాలు తరువాత లిప్‌స్టిక్‌ను అప్లై చేసుకోవాలి.. లిప్ బామ్ కూడా ఉపయోగించవచ్చు. ఇది పెదవులకు రక్షణ పొరలాగా పనిచేస్తుంది. పెదాలను తేమగా ఉంచుతుంది మరియు లిప్ స్టిక్ కారణంగా ఎండిపోకుండా చేస్తుంది.
చివరగా……
అతి వేడి అతి చల్లని పదార్థాలకు కూడా దూరం గా ఉంటూ పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతమవుతాయి. అయితే కొంచం ఓపిక ముఖ్యం సుమా…..