ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల నిద్రలేమి సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నవారు. శరీరం లో ఉన్న అన్ని రోగాలు తగ్గించుకోవడానికి కొన్ని మందులు ఉపయోగిస్తే నిద్రలేమి సమస్యలు తగ్గించుకోవడానికి చాలా రకాల మందులను ఉపయోగిస్తున్నారు. నిద్రలేమి సమస్యను తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చాలా రకాల మందులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. పూర్వం రోజుల్లో రోజంతా కష్టపడి రాత్రి అయ్యే సరికి కొంచెం కడుపునిండా తిని పడుకునే వారు.
అలా పడుకోగానే నిద్ర వచ్చేది. కాని ప్రస్తుతం శరీరానికి ఎక్కువ శ్రమ కలగకపోవడం వలన నిద్రలేమి సమస్య చాలా ఎక్కువగా ఉంది. రాత్రంతా సరిగా నిద్రపోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేసుకోవడానికి మన శరీరం సహకరించదు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. మానసిక ఆందోళన, స్ట్రెస్ పెరిగిపోతాయి. రోజుకు 8 నుండి 9 గంటల నిద్ర అవసరం. శరీరానికి రెస్ట్ లేకపోవడం వల్ల హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను తగ్గించుకొని సుఖంగా నిద్ర పోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు.
అయినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. ఒకసారి ఈ చిట్కా ట్రై చేసినట్లయితే గాఢ నిద్ర పడుతుంది. చిన్న పిల్లలాగా నిద్ర పోతారు. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పాలు వేసి స్టౌ మీద పెట్టి మరిగించాలి. తర్వాత గ్లాసులో వేసుకొని ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా ఈ పాలను తాగినట్లయితే నిద్రలేమి సమస్య వెంటనే తగ్గుతుంది. పాలు తాగిన ఐదు నుండి పది నిమిషాల లోపు గాఢ నిద్రలోకి జారుకుంటారు.
ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. పాలు తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ట్రై చేయవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు.