మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. ఇది మనకి సూర్యుడు ఎండ వలన శరీరానికి దొరుకుతుంది. ఉచితంగా దొరికే విటమిన్ డి మన భారతదేశంలో కనీసం 90శాతం మందికి దొరకక పోవడానికి ముఖ్యకారణం మనం ఎండ తగలకుండా జీవన విధానాన్ని మార్చుకోవడమే. ప్రతి పదిమందిలో కనీసం ఎనిమిది మందిలో విటమిన్ డి లోపం ఉంటుంది.
విటమిన్ డి శరీరంలోని కాల్షియం మరియు ఫాస్ఫేట్ మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు మరియు కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పోషకాలు అవసరం. విటమిన్ డి లేకపోవడం వల్ల పిల్లలలో రికెట్స్ వంటి ఎముక వైకల్యాలు మరియు పెద్దలలో ఆస్టియోమలాసియా అనే పరిస్థితి వల్ల ఎముక నొప్పి, ఎముకలు పెలుసు బారడం, వెన్నుపూస ఆకృతి మారడం, కాళ్లు వంకర్లు పోవడం, విరిగిపోవడం వంటి సమస్యలు వస్తుంది.
వీటిని తగ్గించుకోవడానికి ఉదయం 9 గంటల నుండి రెండు గంటల లోపు కనీసం ఒక గంట ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇతర దేశాలలో ఎండ సరిగ్గా లేకపోవడం వలన వారు సప్లిమెంట్లపై ఆధారపడవలసి వస్తుంది. కానీ మనదేశంలో ఎండ పుష్కలంగా లభిస్తుంది. గనుక వీలైనంతవరకూ సహజంగా విటమిన్-డి పొందడానికి ప్రయత్నించాలి. ఆహారాలలో సోయా పాలు. విటమిన్ D తో నిండి ఉంటాయి. రోజూ ఒక కప్పు సోయా పాలు తీసుకోవడం మంచిది. తృణధాన్యాలు, నారింజ రసం, బాదం పాలు, మష్రూమ్స్ వంటివి విటమిన్ డి2 అందిస్తాయి.
మీరు మాంసాహారం తినేవారయితే ఆహారంలో విటమిన్ డి కోసం చాలా గొప్ప వనరులు ఉన్నాయి, సాల్మన్, గుడ్డు సొనలు, చీజ్, ట్యూనా, కొవ్వు చేపలు, కొన్ని తృణధాన్యాలు మరియు ఇతర బలవర్థకమైన ఆహారాలు వంటి ఆహార వనరులు మంచి విటమిన్ డి యొక్క అత్యధిక మూలాలుగా పరిగణించబడతాయి. ఇలా ఆహారాలలో విటమిన్ డి ఉండే ఆహారాలు తీసుకుంటూ వీలైనంతగా బయట దొరికే ఎండను పొందడం చాలా అవసరం. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా విటమిన్ డి లేకపోతే అది మలమూత్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే శరీరానికి కావలసిన పోషకాలు అందాలంటే విటమిన్ డి చాలా అవసరం.