Natural Tips to Prevent Hair Loss

జుట్టుకు నూనె ఇలా తయారు చేసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు,తెల్ల వెంట్రుక ఉండదు.

జుట్టు పెరుగుదలకు జుట్టు రాలిన చోట జుట్టు తిరిగి పెరగడానికి ఉపయోగపడే ఒక హెయిర్ ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనం కొబ్బరి నూనె తీసుకోవాలి. మనం ఒక కేజీ నూనె తయారు చేసుకునేలా ఉంటే గుప్పెడు ఆనియన్ సీడ్స్ తీసుకోవాలి. ఉసిరికాయలు తీసుకుని వాటి తురుము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. 

అలాగే ఇందులో అతి ముఖ్యమైన పదార్థం జటామాన్షి. ఇది ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జటామాన్షి ఒక 50 గ్రాములు వేసుకోవాలి. తర్వాత పదార్థం శీకాకాయ. ఇది జుట్టును మృదువుగా చేయడంలో పొడవుగా పెరగడం సహకరిస్తుంది. దీనిని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. 

మెంతులు యొక్క లాభాల గురించి మనందరికీ తెలిసిందే. వీటిని 25 గ్రాములు తీసుకోవాలి. ఇండిగో పౌడర్ 25 గ్రాములు తీసుకోవాలి. ఇది జుట్టు నల్లగా చేయడానికి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేయడానికి సహాయపడుతుంది. దీనిని 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఆయుర్వేద షాపుల్లో మారేడు గుజ్జు అందుబాటులో ఉంటుంది. దీనిని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. 

తంగేడు పూలు లేదా తంగేడు ఆకులు ఎండబెట్టినవి గుప్పెడు తీసుకోవాలి. అలాగే గుప్పెడు ఎండు మందారపూలు కూడా తీసుకోవాలి. గుంటగలగరాకు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరివేపాకు 50 గ్రాములు తీసుకోవాలి. ఇందులో ఎండిన పదార్థాలను నాలుగు లీటర్ల నీటిలో వేసి అవి ఒక లీటర్ అయ్యేంతవరకు బాగా మరిగించాలి. వీటిలో ఉండే ఔషధగుణాలు నీటిలోకి వచ్చేలా చేయడమే ఈ కషాయం. 

 ఈ నీటిని కొబ్బరి నూనెలో వేసి పచ్చిగా ఉన్న మిగతా పదార్థాలను కూడా నూనెలో వేయాలి. సిమ్ లో పెట్టి నీళ్లు ఆవిరి  అయ్యేంతవరకు  మరిగించాలి. ఈ నూనెను 45 రోజుల వరకు క్రమం తప్పకుండా వాడటం వలన జుట్టు పెరుగుదల, చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య ఉన్నవారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఇది ఆయుర్వేద ఈ పద్ధతిని అనుసరించి తయారు చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా చేసి జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!