Natural Treatments for Hair Loss

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్య జీవితంలో ఉండదు

పొడవైన ఒత్తైన జుట్టు కోసం ఇప్పుడు చెప్పబోయే చిట్కా ప్రయత్నించి చూడండి. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో ఈ పదార్థాలు అన్నీ చాలా బాగా సహాయపడుతాయి. ఈ పదార్థాలు అన్నీ జుట్టు నల్లగా, దృఢంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. మన ఇంట్లో కరివేపాకు అనేది తప్పకుండా ఉంటుంది. కరివేపాకును ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది అని మనందరికీ తెలుసు. అయితే కొంతమంది కర్వేపాకు తీసుకోవడానికి చిరాకు పడుతుంటారు. అలాంటివారు ఇలా వాడటం వలన జుట్టుకు కరివేపాకు యొక్క లాభాలు అందడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

 దానికోసం స్టవ్పై ఒక గిన్నె పెట్టి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకు వేయాలి. అలాగే ఒక రెండు స్పూన్ల కలోంజీ సీడ్స్ వేయాలి. జుట్టు నల్లగా ఉండడానికి, కుదుళ్ళ నుండి బలంగా ఉండడానికి జుట్టు యొక్క కణాలను ప్రోత్సహిస్తుంది. బలహీనపడిన జుట్టు కుదుళ్లను దృఢంగా చేసి బలంగా పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది  తర్వాత పదార్థం మెంతులు. గాలిలోని పొల్యూషన్, దుమ్ము ధూళికి గడ్డిలా మారిన జుట్టును మృదువుగా చేసి ఆరోగ్యంగా చేయడంలో మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగి రంగు మారిన తరువాత నీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు.

 ఈ కరివేపాకు నీటిని తలకు స్ప్రే చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేసిన అరగంట తరువాత మైల్డ్, హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వలన జుట్టు రాలిపోవడం తగ్గి పలచబడిన జుట్టు తిరిగి ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు, చిన్న చిన్న కురుపులు వంటి సమస్యలు ఉన్నవారు ఈ నీటిని వాడటం వలన జుట్టు చుండ్రు తగ్గి పొడవుగా రెండు రెట్లు అధికంగా పెరుగుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు గనుక ఎటువంటి అనుమానం లేకుండా ఈజీ గా ఉపయోగించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!