హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్. కారణం ఏదైనా కానీ నేటి స్త్రీల నోటిలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. సంతానం లేకపోవడం, రుతుస్రావం లో ఇబ్బందులు, అధిక రక్తస్రావం లేదా రక్తస్రావం లేకపోవడం, రుతుస్రావం సమయంలో విపరీతమైన నొప్పి ఇవన్నీ హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలు.
ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలి. వీటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు స్త్రీలలో వచ్చే హార్మోనల్ ఇన్ బేలన్స్ను సరిచేయగలదు. ఇలా ఋతుస్రావంలో నొప్పి వస్తూ ఉండేవాళ్ళు విపరీతంగా మందులు వాడుతూ ఉంటారు. అది దీర్ఘకాలంలో కిడ్నీలు పాడవడానికి కారణమవుతుంది.
అందుకే వీలైనంత వరకు సహజంగా నొప్పిని తగ్గించుకునే మార్గాలను అవలంబించాలి రుతుస్రావం లో నొప్పి వచ్చే సమయంలో ఆవనూనె పొత్తికడుపుపై మసాజ్ చేయడం వలన నొప్పి తగ్గుతుంది. అలాగే యూకలిప్టస్ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది.
కానీ యూకలిప్టస్ ఆయిల్ వలన చిన్నపాటి మంటను అనుభవిస్తారు. అందుకే ఈ నూనెను కొబ్బరి నూనెతో లేదా ఆవనూనెతో కలిపి పొత్తికడుపు పై మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన కాటన్ క్లాత్ కాపడం పెట్టాలి లేదా హాట్ వాటర్ పాక్ పెట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
అలాగే దాల్చినచెక్క, సోంపు, అల్లం కొంచెం కొంచెంగా తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. ఈ కషాయంలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది సహజంగా నొప్పి తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే రుతుస్రావం సమయంలో కెఫిన్, సాల్టడ్ ఫుడ్ దూరంగా పెట్టాలి.
ఇవి మజిల్ బిగుసుకోవడాన్ని ఎక్కువ చేస్తాయి. పొత్తి కడుపులో నొప్పిని ఇంకా ఎక్కువ చేస్తాయి. అందుకే ఈ సమయంలో లో కాఫీ, కూల్ డ్రింక్స్ తాగకూడదు. పండ్లు, సలాడ్స్ తీసుకోవాలి. ఇవి కడుపుకు హాయినిస్తాయి .
మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోవాలి. లేదంటే గ్యాస్, మలబద్ధకం పెరిగి మజిల్స్ ఇంకా బిగుసుకొని పొత్తికడుపులో నొప్పి పెరుగుతుంది. అలాగే ఋతుస్రావం టైం లో నీళ్లు ఎక్కువగా తాగాలి. కుదిరితే ఉదయాన్నే పండ్ల రసం ఒకటి తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం, రాత్రికి పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ని తగ్గించడంతోపాటు పొత్తికడుపులో నొప్పి తగ్గడానికి చాలా బాగా సహాయపడుతాయి. మందులు వాడకుండా రుతుస్రావంలో వచ్చే సమస్యలను ఇలా సహజ పద్ధతిలో తగ్గించుకోవచ్చు.