చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు పంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే వీటిని నిర్లక్ష్యం చేయడం వలన పంటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. పంటి నొప్పి చిన్నపాటి నల్లటి గీతలా మొదలై అవి నరాల వరకు చేరితే నొప్పి మొదలవుతుంది. పంటి నొప్పితో బాధపడటం చాలా కష్టం. పంటి నొప్పి వలన కన్ను, చెవి, తల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత తరచుగా పంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనేది డాక్టర్ల మాట.
మనం తినే ఆహారం బాగా జీర్ణం అయితే అది శరీరానికి శక్తిని అందించి శరీర పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పంటి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల చాలామంది తిన్న ఆహారాన్ని నమ్మలేక తిన్నది తిన్నట్టే మింగేస్తారు. దీని వలన ఆహారం సగం సగం జీర్ణమయ్యి పోషకాలు వ్యర్థంగా పోతాయి. అంతేకాకుండా పంటికి ఉండే నరాలు శరీర అవయవాలకు అనుసంధానంగా ఉంటాయి. అందుకే పంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. పంటి నొప్పి వచ్చినప్పుడు దానిని ఓర్చుకోవడం చాలా కష్టం.
పంటినొప్పికి అనేక రకాల మందులు ఉన్నా కొన్ని సార్లు మందులు అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఇంటి నివారణ చిట్కాలు పాటించడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం మనం ఆయుర్వేద షాపుల్లో స్పటికం అని పిలువబడే పటికలాంటి పదార్థాన్ని తెచ్చుకోవాలి. దీనిని ఎక్కువగా ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి పడుతుంటారు. ఇది రుచిలో వగరుగా ఉంటుంది. దీనిని చిన్న ముక్క తీసుకొని ఒక గ్లాసు నీటిలో ఒక 10 నిమిషాల పాటు నాన బెట్టాలి. స్పూన్‌తో కలపడం వల్ల త్వరగా కరుగుతుంది.
తరువాత ఈ నీటితో నోటిని బాగా పుక్కిలించి గొంతులో శబ్దం వచ్చేలా చేయడం వలన పంటికి తగిలితే అక్కడ ఉండే బ్యాక్టీరియాను ఇప్పటికీ నశింపజేస్తుంది. అలాగే నొప్పి నుండి నరాలకు బలం కలుగుతుంది. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. పంటి నొప్పి ఉన్నవారు అప్పటికప్పుడు ఈ చిట్కాలు ప్రయత్నించడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు.