మన ఆధునిక సమాజంలో జీర్ణ సమస్యలు మన దినచర్యలో ఒక భాగంగా మారాయి. తరచుగా అసౌకర్యంగా, బాధాకరంగా లేదా ఇబ్బందికరంగా ఉంటుంది కారణాలు ఏమంటే. విరేచనాలు, మలబద్ధకం, ప్రకోపించిన ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్), ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (ఐబిడి) మరియు గుండెల్లో మంట వంటివి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సాధారణ సమస్యలు. అనారోగ్యకరమైన జీవనశైలి, పేలవమైన పోషణ, ఆహార విషయంలో అజాగ్రత్త వల్ల ఇవి సంభవిస్తాయి.
అయితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నట్టు జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి కొన్ని సులువైన మార్గాలను ఉన్నాయి. చేయాల్సిందల్లా మనం ఇపుడు చెప్పుకోబోయే పద్దతులను ఫాలో అవ్వడమే.
జీర్ణక్రియను సహజంగా మెరుగుపరచడానికి 5 మార్గాలు
◆ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ను పెంపొందించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఈ బాక్టీరియా విటమిన్లు మరియు షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి, ఇవి ఇతర ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించి, పెంచుతాయి, వ్యాధికి కారణమయ్యే బాక్టీరియాతో తలపడి విచ్చిన్నం చేస్తాయి. వ్యాధి సంక్రమణను తగ్గించి నివారించడానికి మరియు దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహకరించే గొప్ప ఆహారం పెరుగు దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా ఉంటుంది.
◆జీర్ణక్రియ సరిగా లేనపుడు మొదట చేయవాల్సినది ఆహారంలో మార్పు. మీరు తినే విధానం మీ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆహారపు అలవాట్లను మార్చడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చూడండి.
హడావిడిగా తినకూడదు ప్రశాంత వాతావరణంలో తినండి మరియు తినడంపై దృష్టి పెట్టండి.
టీవీ మరియు ఫోన్‌ను ఆపివేయాలి, తద్వారా మీరు తినే ఆహారం పై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. తినేటప్పుడు ఆహారపు రుచి, రాసిన, రంగు వంటివి ఆస్వాదించాలి.
కోపం, చిరాకు వంటి స్థితులలో ఉన్నపుడు ఏ ఆహారం తీసుకోకూడదు. మెదడు మరియు జీర్ణవ్యవస్థ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి ఇవి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
నమలడం అనేది జీర్ణ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది దీన్ని నిలక్ష్యం చేయకండి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి.
◆ జీర్ణక్రియకు నీరు ముఖ్యం! ఘన ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు పోషకాలను సరిగా గ్రహించడానికి మనకు నీరు అవసరం. నీరు లేకుండా, మొత్తం శరీర పనితీరు తగ్గుతుంది, శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మరియు రక్తపోటు, మలబద్దకానికి కారణమవుతుంది.
◆ అధిక టాక్సిన్లు చాలా మందికి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు, అతిసారం, మలబద్దకం లేదా ఐబిఎస్‌తో చాలా మంది విషయంలో పెద్ద సమస్యలు. వీటిని నిర్మూలించాలంటే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
బయట ఆహారం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకుసదు. వీటిలో పోషక విలువల ఉండవు అధికంగా క్యాలరీలు మరియు కృత్రిమ రుచులు, రంగులులతో నిండి ఉంటాయి, ఇవి మూత్రపిండాలు మరియు కాలేయానికి హాని కలిగిస్తాయి.
◆ జీర్ణశయానికి దోహదపడే ఆమ్లాలను పెంచాలి. జీర్ణక్రియ పోషకాలను ఎక్కువగా గ్రహించే చిన్న ప్రేగులలోకి విడుదల కావాలంటే, ఆహారం ద్రవ స్థితిలో ఉండాలి. కాబట్టి మీరు ప్రతి ఆహారాన్ని పూర్తిగా నమలకపోతే ఈ జీర్ణక్రియను ప్రోత్సహించే ఆమ్లాలు ఉత్పత్తి కావు. ఆహారాన్ని బాగా నమలకపోతే అది ఘనరూపంలో జీర్ణక్రియను ఇబ్బంది పెట్టడమే కాకుండా మలబద్ధకానికి, తద్వారా మొలలు వంటి సమస్యకు దారితీస్తాయి.
చివరగా……
జీర్ణక్రియను ఆహారవేళలు కూడా ప్రభావితం చేస్తాయి. ఒక కచ్చితమైన సమయాన్ని నిర్ధేశించుకుని పై సూచనలు పాటిస్తుంటే జీర్ణక్రియ సమర్థవంతంగా ఉంటుంది.