చాలా మందికి ఒళ్ళంతా తెల్లగా ఉండి మెడ మాత్రమే నల్లగా అయిపోతుంది. దానికి కారణం మనం మెడలో వేసి ఆభరణాలు కూడా కారణం కావచ్చు. కొంతమంది వన్ గ్రామ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల మెడ భాగం నల్లగా అయిపోతుంది. కొంచెం లావుగా ఉన్నవారికి అయితే మెడ భాగం మడతలు పడి ఉండడం వల్ల స్నానం చేసినప్పుడు మట్టి మడతల్లో పెరిగిపోయి ఉంటుంది. సన్ టాన్ వలన కూడా మెడ భాగం నల్లగా అవుతుంది.
మెడ నలుపు పోగొట్టుకోవడానికి రకరకాల క్రీమ్స్, చిట్కాలను ఉపయోగించి ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినట్లయితే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. మెడ నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది. దీనికోసం కావలసినవి బాదంపప్పులు, మిల్క్ పౌడర్, తేనె. దీనికోసం ముందుగా ఎనిమిది బాదంపప్పులను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. ఉదయం బాదం పప్పులపై పొట్టు తీసి బాదంపప్పులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఒక చెంచా మిల్క్ పౌడర్ ని కలుపుకోవాలి.
తర్వాత దీనిలో ఒక చెంచా తేనె కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉండవ్వాలి. తర్వాత ఈ ప్యాక్ వేసిన భాగంలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకుంటూ ప్యాక్ తీసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి నాలుగు రోజులపాటు చేసినట్లయితే మీ మెడ నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది. నాలుగు రోజులు కుదరదు అనుకున్నవారు కనీసం మూడు రోజులైనా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పార్లర్ కి వెళ్లి గంటలకొద్ది కూర్చుని వేలకు వేలు ఖర్చుపెట్టి బ్లీచ్ చేయించుకున్నప్పటికీ ఇంత మంచి రిజల్ట్ ఉండదు.
ఈ ప్యాక్ ఉపయోగించడం వలన ఎటువంటి ఖర్చు ఉండదు. సమయం వృధా అవ్వదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మంపైన పేరుకుపోయిన జిడ్డు, మురికి వెంటనే పోతాయి. ఇంకా జిడ్డు నలుపు పోదు అనుకున్న వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌ను వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్‌ను మెడ భాగంలోనే కాకుండా నల్లగా ఉన్న ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. తేడా చూసి మీరే ఆశ్చర్యపోతారు.