ప్రతిరోజు స్నానం చేస్తున్నప్పటికీ మెడ భాగం నల్లగా అయిపోతుంది. మనం మెడలో వేసుకుని ఆభరణాల వలన మెడ భాగం నల్లగా అయిపోతుంది. మెడ నలుపు తగ్గించుకోవడం కోసం రకరకాల కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నలుపు మాత్రం పోదు. నాచురల్ గా మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిన్న చిట్కాలను ట్రై చేసినట్లయితే మన శరీరంపై లేదా శరీరం లోపల ఉండే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు మనం మెడ నలుపును ఒక్కసారికే పోగొట్టే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు చాలా కోల్గేట్ పేస్టు వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉండడం వలన మెడ పై ఉండే నలుపు, జిడ్డు, మురికి పోగొట్టడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక చెంచా బియ్యప్పిండిని వేసుకోవాలి. బియ్యప్పిండి స్కిన్ వైటినింగ్ కి చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. పీల్ ఆఫ్ మాస్క్ చిన్న చిన్న షాపులలో లేదా మెడికల్ షాప్ లలో కూడా లభిస్తుంది.
దీన్ని తీసుకొని ఒక చెంచా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయడానికి ముందు మెడ నల్లగా ఉన్న భాగం మొత్తం టవల్ ని వేడి నీటిలో ముంచి తుడుచుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని మెడ భాగం మొత్తం నిమ్మ చెక్కతో రుద్దాలి. తర్వాత మళ్లీ నీటితో కడగనవసరం లేకుండా టవలు వేడి నీటిలో ముంచి మళ్లీ తుడుచుకోవాలి. మన ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఆరిన తర్వాత కొంచెం బియ్యం పిండి జల్లి నలుగు నలిపినట్లుగా నలుపుకోవాలి.
తర్వాత మళ్లీ నిమ్మచెక్కను పంచదార లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో ఉండే జిడ్డు, మురికి, మొత్తం పోయి నలుపు తగ్గుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం స్నానం చేయడానికి అరగంట ముందు చేసుకోవాలి. వారానికి ఒకసారి చేయడం వలన మెడ నలుపు మొత్తం పోతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకసారి అప్లై చేసేసరికి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.