ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది అందరికీ వచ్చే ఒక పెద్ద సమస్య. మరి దీనిని అధిగమించాలి అంటే నాలుగు రకాల ప్రాణాయామాలు మానసికంగా మన స్ట్రెస్స్ ఎలా తగ్గిస్తాయో సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అవి ఏమిటి అంటే మొట్టమొదటి ప్రాణాయామం చంద్ర చేదన ప్రాణాయామం. ఇది చేయడం వల్ల శరీరంలో పారాసింపథటిక్ నెర్వస్ సిస్టం బాగా స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్ ని బాడీ ని రిలాక్స్ చేయడానికి ఈ చంద్ర చేదన ప్రాణాయామము ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామంలో గాలిని ఎడమ ముక్కు నుంచి పీల్చుకుని ఎడమ ముక్కు నుంచే వదలాలి. ఇలా నాలుగు ఐదు నిమిషాల పాటు ప్రతిరోజు చేయాలి.
ఇక రెండవది బ్రామరీ ప్రాణాయామం దీనిని చెవిలో వేలు పెట్టుకుని తేనెటీగలు చేసే శబ్దంలా చేస్తూ ఉండాలి. ఈ బ్రామరీ ప్రాణాయామం చేయడం వలన బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగ్ పెరిగి బ్రెయిన్ లో హైపోథలామస్ రిలాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల బ్రామరీ ప్రాణాయామము చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఇక మూడవది సీతలీ ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో కోర్ టెంపరేచర్ తగ్గి కూలింగ్ ఎఫెక్ట్ వల్ల బాగా హాయిగా అనిపిస్తుంది. ఈ సీతలీ ప్రాణాయామాన్ని 10 నిమిషాలు చెయ్యాలి.
దీని వల్ల శరీరంలో కూలింగ్ పెరిగి బ్రెయిన్ కూడా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి హీట్ తగ్గి కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి అంటే దంతాలను కలిపేసి నాలుకను పైకి పెట్టి గాలిని నోటి ద్వారా పీల్చుకోవాలి. ఇక నాలుగవది సీత్కరి ప్రాణాయామం ఇది కూడా కూలింగ్ ప్రాణాయామమే. సీత్కరి ప్రణామం ఎలా చేయాలి అంటే నాలుకను మడతపెట్టి గాలిని లోపలికి బయటికి పిలుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది. శరీరంలో రక్తనాళాలన్నీ ఫ్రీగా ఉంటాయి. దీనితోపాటు హ్యాపీ హార్మోన్స్ బాగా ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీనితో పాటుగా పొట్టలో యాసిడ్ సెక్రెషన్స్ బాగా తగ్గుతాయి.
స్ట్రెస్ తగ్గడానికి ఈ నాలుగు ప్రాణయామాలను రోజుకి 20 నిమిషాలు గాని అరగంట గాని చేస్తే ఫలితం ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇలాంటి ప్రాణాయామాలను చేపించడం ద్వారా ముందు నుంచే వారికి స్ట్రెస్ తగ్గించే అవకాశం ఉంటుంది.